Mon. Aug 3rd, 2020

Sambashana

Telugu News Portal

రజినీ మాత్రమే సాధ్యమయ్యే ప్రొమోషన్స్ ఇవి…

1 min read
darbar

ఒక స్టార్ హీరో సినిమా చేసి దాన్ని నేషనల్ వైడ్ ప్రమోట్ చేయాలి అంటే హ్యుజ్ బడ్జట్ ఉండాలి, కథలో అన్ని వర్గాల ప్రేక్షకులని… అన్ని ప్రాంతాల సినీ అభిమానులని మెప్పించే స్పాన్ ఉండాలి. అన్నింటికీ మించి భారీ స్టార్ కాస్ట్ అండ్ ఇంటెల్లిజెంట్ ప్రమోషనల్ స్ట్రాటజీస్ వాడాలి. అప్పుడే ఆ మూవీ పాన్ ఇండియా సినిమా అవుతుంది. బాహుబలితో మొదలుపెడితే కేజీఎఫ్ వరకూ ప్రతి మూవీ ఈ స్ట్రాటజీని ఫాలో అయ్యే సినిమాలని ఇండియా వైడ్ ప్రమోట్ చేస్తూ ఉంటాయి… కానీ ఈ లెక్కలు అందరికీ వర్తిస్తాయెమో కానీ ఒక్కడికి మాత్రం కాదు. అతని సినిమా అనౌన్స్ అయితేనే పాన్ ఇండియా సెన్సేషన్ అవుతుంది. నాలుగు దశాబ్దాలుగా అల్ ఇండియా అభిమానులని అలరిస్తూ, ట్రూ సూపర్ స్టార్ గా ఉన్న రజినీకాంత్ కి మాత్రం ఇవన్నీ వర్తించవు. ఆయన సినిమా వస్తే చాలు నేషనల్ హాలిడే రేంజులో సంబరాలు జరుగుతాయి, రజినీ రాక కోసం ఇండియన్ మూవీ లవర్స్ అంతా అంతలా వెయిట్ చేస్తూ ఉంటుంది.

ప్రొమోషన్స్ ఏ అవసరం లేని రజినీ సినిమాకి కూడా అప్పుడప్పుడూ మేకర్స్ ఆకాశాన్ని తాకే ప్రొమోషన్స్ చేస్తూ ఉంటారు… కబాలి సినిమాతో ఫ్లైట్ ని రెడీ చేసినా, రోబో 2.0లో హాలీవుడ్ లో ప్రమోషన్ చేసినా అది రజినీకి మాత్రమే సాధ్యం అయ్యింది. మరోసారి ఆ రజినీ మార్క్ ప్రమోషన్స్ చేస్తూ దర్బార్ కోసం స్పెషల్ ఫ్లైట్ రెడీ చేస్తున్నారు. మురుగదాస్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో 28 ఏళ్ల తర్వాత రజినీకాంత్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. జనవరి 9న విడుదల కానున్న ఈ మూవీతో రజినీ 2020కి గ్రాండ్ వెల్కమ్ చెప్తాడేమో చూడాలి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.