Sat. Apr 4th, 2020

Sambashana

Online News Portal

‘శ్రీకృష్ణ ద్వారక’ రహస్యాన్ని ఛేదించే పనిలో పడ్డ కార్తికేయ…

1 min read
karthikeya 2 concept video

నిఖిల్ సిద్దార్థ హీరోగా 2014లో వచ్చిన సినిమా కార్తికేయ. ఒక గుడి రహస్యాన్ని కార్తికేయ అనే మెడికల్ స్టూడెంట్ ఎలా ఛేదించాడు అనేది ఆ సినిమా కథ. చందు మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. అయిదేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ ని అనౌన్స్ చేసిన చిత్ర యూనిట్ కార్తికేయ2 కాన్సెప్ట్ వీడియోని రిలీజ్ చేశారు.

కార్తికేయ టీం నుంచి వస్తున్న ఈ సీక్వెల్ స్కేల్ పెంచుతూ, గ్రాండ్ గా షూట్ చేస్తున్నారు. శ్రీకృష్ణ మరణం, సముద్రంలో మునిగిన ద్వారక నగరం చుట్టూ కార్తికేయ 2 సినిమా తిరుగుతుందని మోషన్ పోస్టర్ తోనే చెప్పేశారు. తెలుగు తమిళ హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ మెయిన్ అట్రాక్షన్ కాబోతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.