Sat. May 30th, 2020

Sambashana

Telugu News Portal

ఎన్టీఆర్ విషయంలో రాజమౌళి అనుకున్నంత పని చేశాడు

1 min read
ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. బుధవారం ఎన్టీఆర్ పుట్టిన రోజు. పుట్టిన రోజు నాడు ఎన్టీఆర్ టీజర్ వస్తుందని ఫ్యాన్స్ అందరూ భావించారు. కానీ లాక్ డౌన్ వ‌ల్ల తాము అనుకున్న స‌మ‌యానికి టీజ‌ర్‌ని పూర్తి చేయ‌లేక‌పోయామ‌ని, అందుకే ఈసారి ఫ‌స్ట్ లుక్‌గానీ, టీజ‌ర్ గానీ చూపించ‌డం కుద‌ర‌డం లేద‌ని ఆర్ఆర్ఆర్ అధికారికంగా ప్రకటించింది. ఇది వ‌ర‌కు ఎన్టీఆర్ అభిమానుల‌కు మాట ఇచ్చామ‌ని, ఆద‌రాబాద‌ర‌గా ఏదో ఓ టీజ‌ర్‌ని విడుద‌ల చేయ‌లేమ‌ని, ఎన్టీఆర్ టీజ‌ర్ ఎప్పుడు బ‌య‌ట పెట్టినా అది అభిమానుల‌కు ఓ పండ‌గ‌లా ఉండ‌బోతోంద‌ని చెప్పుకొచ్చారు చిత్ర యూనిట్.

నిజానికి ఎన్టీఆర్ టీజర్ ను రిలీజ్ చెయ్యాలని చిత్ర యూనిట్ ప్రయత్నించినప్పటికీ స‌రిప‌డేంత ఫుటేజ్ లేకుండా పోయింది. ఎన్టీఆర్ నుంచి రెండున్నరేళ్లుగా సినిమా వార్త లేకపోవడంతో నందమూరి అభిమానులు, ఈ పుట్టిన రోజుకి అయినా అది నెరవేరుతుంది అనుకున్నారు కానీ జక్కన్న మాత్రం లాక్ డౌన్ కారణంగా పనులు అవ్వలేదని చేతులెత్తేసాడు. మరి తమ హీరోని చూడాలి అనుకుంటున్న ఎన్టీఆర్ అభిమానుల ఆశలు నెరవేరేది ఎప్పుడో చూడాలి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.