Mon. Aug 3rd, 2020

Sambashana

Telugu News Portal

రివ్యూ: సాహూ

1 min read

ముఖ్య గమనిక: మేము మా రివ్యూని సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల తర్వాతే ఇస్తాము.

టైటిల్‌ : సాహో
జానర్‌ : యాక్షన్‌ థ్రిల్లర్‌
నటీనటులు : ప్రభాస్, శ్రద్ధా కపూర్‌, నీల్‌ నితిన్‌ ముఖేష్‌, చంకీ పాండే, జాకీ ష్రాఫ్‌, అరుణ్ విజయ్‌
సంగీతం : తనిష్క్‌ బగ్చీ, గురు రాంద్వా, బాద్‌షా
నేపథ్య సంగీతం : జిబ్రాన్‌
నిర్మాత : వంశీ, ప్రమోద్
దర్శకత్వం : సుజీత్‌

ప్రభాస్ సుజిత్ కాంబినేషన్ లో భారీ హైప్ మధ్య విడుదలైన సాహూ సినిమా, ఆ అంచనాలని అందుకోవడంలో ఎంత వరకూ సక్సస్ అయ్యింది? ఫెయిల్ అయ్యింది అనే విషయాలు కాసేపు పక్కన పెడితే సాహూకి ఫస్ట్ షో నుంచే నెగటివ్ టాక్ వినిపిస్తోంది, 350 కోట్లతో తెరకెక్కిన సినిమాకి ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో చూద్దాం. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే తో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి వాటిలో కొన్ని ప్రేక్షకులని అలరించాయి కానీ ఆడియన్స్ ని అట్రాక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాయి. సాహూ విషయంలో సుజీత్ బలం అనుకున్న స్క్రీన్ ప్లే నే సినిమాకి మైనస్ అయ్యింది. ఏ సీన్ ఎక్కడ జరగుతుంది? ఏ ప్లేస్ లో జరుగుతున్నాయి? ఫ్లో ఆఫ్ సీన్స్ ఏంటి అనేది అర్ధం కాదు? అంటే సినిమా ఎటు నుంచి ఎటు వెళ్తుందో అర్ధం కానీ పరిస్థితికి ఆడియన్స్ రావడం ఆశ్చర్యం.

మొదటి ఫైట్ స్టార్ట్ అయ్యి ప్రభాస్ ఇంట్రడక్షన్ జరిగిన తర్వాత ఒక ఇంట్లో పాంథర్ ఉండడం ఏంటి? అసలు అక్కడ అది ఎందుకు వచ్చింది, వెంటనే ఎందుకు మాయం అయ్యింది? ఇంటర్వల్ తర్వాత ప్రభాస్ గాల్లో జంప్ చేసి ఒక బ్యాగ్ అందుకోని కిందకి దూకే సీన్ ఉంది? ప్రభాస్ అసలు ఎందుకు దూకాడో? ఎక్కడి నుంచి దూకాడో? కనీసం ప్రభాస్ కైనా తెలుసో లేదో? ఈ సీన్ తర్వాత బ్యాడ్ బాయ్ సాంగ్ వస్తుంది. సినిమాకి సంబంధం లేని ఈ పాటలో యుద్ధ ట్యాంకర్లు, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వచ్చేస్తారు… ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించేలా ఉండే సీన్స్ ని అయినా ట్రిమ్ చేసి ఉంటే బాగుండేది.

ఇక యాక్షన్ ఎపిసోడ్స్ విషయానికి వస్తే, ఎస్ సాహూ సినిమాలో అదిరిపోయే యాక్షన్ ఎపిసోడ్స్ ఉన్నాయి. కానీ అవి మాత్రమే సినిమాని నడిపిస్తాయా? ఫైట్ సీక్వెన్స్ మధ్యలో ఫ్లైయింగ్ సోల్జర్స్ వస్తారు… ఆ సూట్ ని ప్రభాస్ వేసుకోని ఎగిరితే థియేటర్స్ ల విజిల్స్ పడాలి. ఈ దృష్టితోనే ఆ సీన్ డిజైన్ చేసి ఉంటారు కదా మరి ఆ సూట్ ప్రభాస్ వేసుకోగానే అందులో గ్యాస్ అయిపోతే, ఆ సీన్ ని ఒక రేంజులో ఉహించుకున్న ఆడియన్స్ పరిస్థితి ఏంటి? ఇక పోతే ఏదైతే సుజిత్ ఏదైతే సర్ప్రైస్ అని ఇంటర్వెల్ వరకూ దాచుకున్నాడో దాన్ని సినిమా చూసే 50రూపాయలు పెట్టి టికెట్ కొనుక్కోని ముందు వరసలో ఉన్న కుర్చీలో కూర్చున్న ఆడియన్ కూడా గెస్ కొట్టి చెప్పేస్తున్నాడు. క్లైమాక్స్ విషయంలో కూడా చిత్ర యూనిట్ సర్ప్రైస్ అనుకున్న దాన్ని కామన్ ఆడియన్ గెస్ కొట్టేస్తున్నాడు.

ఇక పాటల విషయానికి వద్దాం, అంత బడ్జట్ ఉన్న సినిమాలో ఆ పాటలు ఏంటో ఎవరికీ అర్ధం కాలేదు. మ్యూజిక్ డైరెక్టర్ ని ఏదైనా అందామా అంటే పాటకొక మ్యూజిక్ డైరెక్టర్ పని చేశాడు… వినడానికి కానీ అవి వచ్చే టైమింగ్ కానీ అంత ఎంగేజింగ్ గా అనిపించవు. అసలు ఇవ్వనీ పక్కన పెడితే సినిమాకి ఎవరైనా ప్రభాస్ కోసమే వెళ్తాడు, అలాంటిది ప్రభాస్ కి వేసిన మేకప్ కానీ హెయిర్ స్టైల్ కానీ అసలు సెట్ అవ్వలేదు. నోరు తెరిచి మాట్లాడాడు, వేగంగా కదలడు, ఫైట్ సీన్స్ మాత్రమే చేస్తాడు. పోనీ లవ్ స్టోరీ అని బాగుందా అంటే ప్రభాస్ అండ్ శ్రద్ధ మధ్య కెమిస్ట్రీ పుట్టే సీన్ ఒక్కటి కూడా లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే నథింగ్ వెంట పర్ఫెక్ట్ విత్ సాహూ అనే సింగల్ లైన్ స్టేట్మెంట్ ఇవ్వొచ్చు. రన్‌ రాజా రన్‌ లాంటి చిన్న సినిమా చేసిన అనుభవం మాత్రమే ఉన్న సుజీత్‌కు ఇంత భారీ ప్రాజెక్ట్ చేతిలో పెట్టడం అంటే రిస్క్‌ అనే చెప్పాలి. స్టార్ క్యాస్ట్ ని, భారీ బడ్జెట్‌ ని హ్యాండిల్ చేయడంలో సుజీత్ తడబడ్డాడు. స్టైలిష్ మేకింగ్ మీద పెట్టిన కాన్సెన్ట్రేషన్ కథ మీద పెట్టి ఉంటే సాహూ సినిమాకి ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఒక రెగ్యులర్ రివెంజ్ క్రైమ్ డ్రామాకి 350కోట్ల ఖర్చు ఎందుకు పెట్టారు? ఎక్కడ పెట్టారు అనే ఫీలింగ్ రావడం ఖాయం. 172 నిమిషాల డ్యూరేషన్ ని ఇమ్మీడియేట్ ట్రిమ్ చేయాలి లేదంటే సినిమా మరింత నష్టపోయే ప్రమాదం ఉంది.

సాహో సినిమాకి ఉన్న ప్రధాన లోపం ఎడిటింగ్, ఫ్లో ఆఫ్ సీన్స్ లేకుండా కంటిన్యుటి లేకుండా చేసిన ఎడిటింగ్… సీన్ తర్వాత సీన్ వచ్చి వెళ్ళింది అన్నట్లు ఉంటుంది తప్ప ఆడియన్స్ ని ఫీల్ తీసుకురాదు. సినిమాటోగ్రఫీ బాగుంది, సినిమా అంత రిచ్ గా ఉందంటే దానికి కారణం సినిమాటోగ్రఫీనే. ఇక జిబ్రాన్ నేపథ్య సంగీతం సినిమాకు ప్లస్‌ అయ్యింది. నార్మల్ సీన్స్ ని కూడా తన బీజీఎమ్ థ్ ఎలివేట్ చేశాడు. నిర్మాణ విలువులు బాగున్నాయి కానీ ప్రొడక్షన్ వాల్యూస్ అంటే కథకి ఖర్చు పెట్టడం, కథకి అవసరమైన వాటికి ఖర్చు పెట్టడం. మొత్తానికి సాహూ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేదు.

చివరి మాట: దక్షిణాది రాష్ట్రాల్లో నష్టాలని మిగిలించిన సాహూ సినిమా నార్త్ లో మాత్రం వసూళ్ల వర్షం కురిపించింది. సాహో తెలుగులో ఫ్లాప్ అవ్వడం వాళ్ల ప్రభాస్ మార్కెట్ కి వచ్చిన నష్టం లేదు. ఇదే రిజల్ట్ నార్త్ లో కూడా వచ్చి ఉంటే ప్రభాస్ చాలా నష్టపోయే వాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఉత్తరాదిలో సాహూ సినిమాతో తన క్రేజ్ ని మరింత పెంచుకున్నాడు. ఫ్యూచర్ మూవీస్ లో కాస్త కథపైన కాన్సెన్ట్రేట్ చేస్తే ప్రభాస్ ప్రతి సినిమా పాన్ ఇండియన్ మూవీ అవుతుంది.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.