Mon. Aug 3rd, 2020

Sambashana

Telugu News Portal

కొత్త నాయకుడు కావాలి…

1 min read

అజ్ఞాతవాసి తర్వాత తెరపై కనిపించని పవన్ కళ్యాణ్, ఏ రోజైనా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తాడనే నమ్మకంతో టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్స్ మైత్రీ మూవీస్, డి.వి.వి దానయ్య, ఏ ఏమ్ రత్నం పవన్‌కు అడ్వాన్స్‌లు ఇచ్చారు. కానీ రాజకీయాల్లో బిజీ అయిన పవన్ సినిమాలకు దూరంగా ఉంటానని ప్రకటించాడు. కానీ 2019 ఎలక్షన్స్‌లో ఓడిపోవడంతో మళ్లీ సినిమాలు చేసేందుకు రెడీ అవుతుందని తెలుస్తోంది. తీసుకున్న అడ్వాన్సులకు లెక్క చెప్పడం కోసమో, మళ్లీ అభిమానుల్ని అలరించడానికో, లేక పార్టీని నడిపించడానికి కావాల్సిన ఆర్థిక అవసరాల కోసమో తెలియదు కానీ కారణమేదైనా పవన్ కళ్యాణ్ మళ్లీ మేకప్ వేసుకోవాలని ఫిక్సయ్యాడనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. మెగా అభిమానులని ఈ న్యూస్ ఎంతో సంతోషపెడుతుంది కానీ నిజంగా పవన్ కళ్యాణ్ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై మెరుస్తాడా అంటే కష్టమనే చెప్పాలి.

2014 మార్చ్ 14న పుట్టిన జనసేనని రాజకీయంగా నడిపించడంలో పూర్తిగా విఫలమైన పవన్ కళ్యాణ్… అటు సినిమాలని, ఇటు రాజనీకాయాలని రెండు బాలన్స్ చేసుకోవాలని ప్రయత్నం చేశాడు కానీ రెండు విషయాల్లో బ్యాడ్ రిజల్ట్ రావడంతో జాగ్రత్తపడిన పవన్ కళ్యాణ్… సినిమాలని పూర్తిగా పక్కన పెట్టి కేవలం ఎన్నికలపైనే ద్రుష్టి పెట్టి ప్రజల్లోనే తిరిగాడు. ఇంత చేసినా ఎన్నికల్లో జనసేన ఘోర పరాభవం తప్పలేదు. ఓన్లీ పాలిటిక్స్ పై కాన్సెన్ట్రేట్ చేస్తేనే చావుదెబ్బతిన్న జనసేనని కాపాడుకోవడానికి బలమైన ప్రణాళిక రచించాల్సిన పవన్. ఇలాంటి సంధి కాలంలో మళ్లీ సినిమాలవైపు వస్తే పార్టీని నడిపించే నాయకుడు ఎవరవుతారు అంటే సమాధానం సూన్యం. ఎందుకంటే జనసేన నడిచేదే పవన్ చరిష్మా మీద, అతనే సినిమాలు చేసుకుంటూ కూర్చుంటే పార్టీ పరిస్థితి ఆగమ్య గోచరంగా తయారవుతుంది. కాబట్టి సినిమా చేయాలనే ఆలోచన దూరంగా జరిగి పవన్ జనసేనాని బలపరిచే ప్రయత్నం చేయాలి. అలాగే తన మాత్రమే పార్టీని నడిపించే బాధ్యత తీసుకోకుండా కింద స్థాయిలో కూడా నాయకులని సిద్ధం చేయాలి

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.