Mon. Aug 3rd, 2020

Sambashana

Telugu News Portal

నవంబర్ 15 పవన్ రీఎంట్రీ, నవంబర్ 16 జనసేన పతనం!

1 min read
pawan kalyan reentry

చిరంజీవి తమ్ముడిగా కాకుండా, మెగాస్టార్ వారసత్వం వాడకుండా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని పవర్ స్టార్ గా ఏలిన ఘనత పవన్ కళ్యాణ్ కి మాత్రమే దక్కుతుంది. హీరోగా టాప్ ప్లేస్ లో ఉండగానే పాలిటిక్స్ వైపు వెళ్లిన పవన్ కళ్యాణ్, మళ్లీ మొహానికి రంగేసుకుంటాడు, సినిమాల్లోకి వస్తాడు అనే వార్త గత కొంతకాలంగా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో, నవంబర్ 15న ఈ మూవీ లాంచ్ కాబోతుందని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అదే నిజమైతే, పవన్ తిరిగి రావడమే ఖాయమైతే… ఏ నవంబర్ 15న జనసేనాని పవన్ కళ్యాణ్, తిరిగి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారుతాడో, దానికి సరిగ్గా 24 గంటల తర్వాతి నుంచి అంటే నవంబర్ 17 నుంచి జనసేన పతనం మొదలవుతుంది. ఇది అక్షర సత్యం, కాలమే దీనికి సాక్ష్యం.

pawan kalyan re entry

2019 చావు దెబ్బ…

2019 ఎన్నికల ఫలితాల తర్వాత దేశ వ్యాప్తంగా రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా ఏపీలో ఉత్తరాదిన జెండా ఎగరేసిన బీజేపీకి ఆంధ్రలో డిపాజిట్లు కూడా రాలేదు. టీడీపీ కంచుకోటలు అని చెప్పుకునే ఎన్నో స్థానాలు ఫ్యాన్ గాలికి గల్లంతయ్యాయి. వైసీపీ హవా ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పవర్ కూడా సరిపోలేదు. స్వయానా జనసేననే పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయాడంటే రాష్ట్రంలో జనసేన పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఈ కష్టం నుంచి పార్టీని బ్రతికించాలని చూస్తున్న పవన్ కళ్యాణ్, వచ్చే ఎన్నికల నాటికి పార్టీని బలోపేతం చేసేలా ప్రణాళిక రచిస్తున్నాడు.

భవిష్యత్తు జనసేనదే…

ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు టీడీపీని వచ్చే ఎన్నికల నాటికి బ్రతికించుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అవేమి పని చెయ్యట్లేదు. కాంగ్రెస్ మరో దశాబ్దం దాటినా ఏపీలో బ్రతకిి బట్టకట్టే పరిస్థితి కనిపించట్లేదు. కేంద్రలో అధికారంలో ఉన్న బీజేపీని తెలుగు ప్రజలు నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేరు. స్టేట్ లో అధికారంలోకి వచ్చిన వైసీపీ కూడా అనుకున్నంతగా మెప్పించలేకపోతోంది. ప్రభుత్వం చుట్టూ ఇసుక మాఫియా, కరెంట్ కోత, వరుస హత్యలు లాంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి. తాను చెప్పిన నవరత్నాలనే అమలు చేయడంలో జగన్ ఫెయిల్ అయ్యాడు అనే కామెంట్ బాగా వినిపిస్తోంది. ఇలాంటి సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల బలహీనతలని- వారు చేసే తప్పులని… ప్రజల కష్టాలని- వారి అవసరాలని పట్టించుకోని జనంలోకి వెళ్తే వచ్చే ఎన్నికల నాటికి ప్రత్యామ్న్యాయ పార్టీగా జనసేన ఎదిగే అవకాశం ఉంది.

నాయకుడే దారి తప్పితే, వాళ్లు చెల్లాచెదురు అవుతారు!

2019లో ఆరు శాతం ఓట్లు కూడా రాబట్టలేక పోయిన జనసేనని కింది స్థాయి నుంచి బలోపేతం చేయాలి కానీ పవన్ మళ్లీ సినిమాలు చేయాలి అనే అనాలోచిత నిర్ణయాలు తీసుకోకపోవడం జనసేన పార్టీకి మంచింది కాదు. పార్టీ పెట్టి ఇన్నేళ్లు అయినా పవన్ కళ్యాణ్ ఇమేజ్ అండ్ చరిష్మా మీద మాత్రమే జనసేన నడుస్తోంది. పవన్ సినిమాల్లోకి వెళ్తే ఆయన స్థానంలో నిలబడి ఫేస్ ఆఫ్ జనసేన పార్టీగా నిలబడే నాయకుడే లేడు. ఇలాంటి సమయంలో క్యాడర్ ని, నాయకులని తయారు చేసే పనిలో పవన్ కళ్యాణ్ ఉండడం పైనే జనసేన పార్టీ మనుగడ ఆధారపడి ఉంది. ముందుండి నడిపించాల్సిన నాయకుడే దారి తప్పితే, వెంట నడిచే వారికి లక్ష్యం పెద్దదిగా కనిపిస్తుంది, వారు చెల్లాచెదురు అవ్వడం మొదలవుతుంది. అయినా పవన్ అభిమానులు, ఆయనలో హీరోని చూడడం మానేసి, నాయకుడిని చూడడం మొదలుపెట్టి చాలా రోజులు అయ్యింది. ప్రతి అభిమాని జనసేనాని అధికారంలోకి రావాలి అని కోరుకుంటున్నాడు కానీ పవర్ స్టార్ గా మారాలి అని కోరుకోవట్లేదు. ఇలాంటి సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాల వైపు అడుగులు ఎందుకు వేస్తున్నాడో ఆయనకే తెలియాలి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.