Thu. Oct 24th, 2019

Sambashana

Online News Portal

అన్నా… చరిత మరవదు నీ ఘనత…

1 min read

ఎన్టీఆర్, విశ్వ విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రాముడు. తెలుగు ప్రజలు అనే పదం వినిపించే అంత కాలం, తెలుగు సినిమా అనే వ్యవస్థ ఉన్నంత కాలం వినిపించే పేరు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాట్లాడుతూ యన్టీఆర్ ప్రస్తావన తీసుకొచ్చారు. ‘అనుభవానికి నేను చాలా పెద్దపీట వేస్తాను. ఇదెప్పుడు నేర్చుకున్నానంటే.. అన్నయ్య ‘ఖైదీ’ సినిమా విడుదలైన తరవాత. చిరంజీవి గారికి చాలా బలమైన స్టార్‌డమ్ స్టార్టయినప్పుడు ఒక తమ్ముడిగా మా అన్నయ్య చాలా పెద్ద హీరో అని అనుకున్నాను. ఆ సమయంలో ఎన్టీ రామారావు గారి ‘విశ్వామిత్ర’ సినిమా వచ్చింది. ఆ సినిమా అన్ని రికార్డులను బద్దలుకొట్టేసింది. ఆరోజు నాకు అర్థమైంది ఏంటంటే.. ఒక వ్యక్తి తాలూకా అనుభవాన్ని ఎప్పుడూ తీసేయలేం. అలాగే ఎంత మంది కొత్తవాళ్లు వచ్చినా, ఎంత మంది రికార్డులు బద్దలుకొట్టినా చిరంజీవి గారి అనుభవాన్ని కొట్టేయలేం’ ఇదీ పవన్‌కల్యాణ్ ప్రసంగంలో అన్న, అన్నయ్యల ప్రస్తావన. పవన్ మాటలు అక్షర సత్యం ఎంత మంది హీరోలు వచ్చినా చిరు స్థాయిని అందుకొలేరు, ఖైదీ నంబర్ 150 సినిమాతో అది ప్రూవ్ అయ్యింది మరోసారి సైరాతో అది ప్రూవ్ కాబోతోంది. అయితే చిరు గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ గొప్పదనం గురించి చెప్పిన పవన్ కళ్యాణ్, అన్నగారిని మళ్లీ గుర్తు చేశారు. అసలు మర్చిపోతే కదా గుర్తు చేయడానికి. పౌరాణికం అంటే ఆయనే గుర్తొస్తాడు, సాంఘికం అన్నా ఆయనే గుర్తొస్తాడు, తెలుగు సినీ చరిత్ర అనగానే కనిపించే గొప్ప వ్యక్తుల్లో ఆయనా ఉంటాడు. నాలుగున్నర దశబ్దాల వెండితెర ఇలవేల్పు ఆయన, సినిమా వైపు అడుగులు వేయడానికి స్ఫూర్తి ఆయన. సినిమాల నుండి రాజకీయాల వైపు వచ్చి అతితక్కువ కాలంలో సీఎం అయిన ఘనత కూడా ఆయనదే. ఎన్ని తరాలు మారినా, ఎంతమంది గొప్ప వ్యక్తులు సినీ,రాజకీయాల్లోకి వచ్చినా తెలుగు ప్రజల గుండెల్లో అన్నగారిగా చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి ఎన్టీఆర్. ఇప్పుడంటే రాజకీయాల కోసం, ఆయన్ని కొంతమంది విమర్శిస్తూ ఉండొచ్చు కానీ ఎక్కడో అందరికీ తెలుసు అన్నగారి గొప్పదనం. ఎన్టీవోడిని మర్చిపోవడం ఎంత కష్టమో ఊర్లల్లో ఉన్న మన తాతలని, అమ్మమలని అడిగితే చెప్తారు. వాళ్ల గుండెల్లో ఆయన స్థానం పదిలం. అందుకే ఏళ్లు గడిచినా, దశాబ్దాలు దాటినా… అన్నా చరిత మరువదు నీ ఘనత.

ఈ సందర్భంగా థాంక్స్ టు పవర్ స్టార్, ఆ వేదికపై ఆ పేరు ఎత్తి నీ ఆలోచనా విధానంలో తనామన తేడా ఉండదు అనే విషయం ఎంతో మందికి తెలిసేలా చేశావ్. తిరిగి రా పవన్ కళ్యాణ్, నిన్ను చూడడం కోసం కోట్ల గుండెలు ఎదురు చూస్తున్నాయి. లేదు నీకు రాజకీయాలే కావాలంటే 2024లో నీ వెంట నడవడానికి, అప్పటి వరకూ నీకు అండగా నిలబడడానికి మెగా సైనికులంతా నీ వెనకే ఉన్నారు… ఈ రాజకీయ నాయకుల్లా కాకుండా నిజమైన నాయకుడిగా ఎదుగు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.