Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

వరల్డ్ బాక్సాఫీస్ ని టార్గెట్ చేసిన ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్స్ …

1 min read
prabhas deepika Prabhas21

పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన ప్రభాస్, అందుకు తగ్గ కథలనే ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టొరీ చేస్తున్న ప్రభాస్, నాగ్ అశ్విన్ తో కలిసి పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే అనౌన్స్ అయిన ఈ భారి బడ్జట్ సినిమాలో హీరోయిన్ గా భాలీవుడ్ క్వీన్ దీపిక పదుకొనేని ఫైనల్ చేశారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ఈ విషయాన్ని తెలియజేస్తూ “రాజుకి తగ్గ రాణి కావాలి కదా అందుకే దీపికాని సెలెక్ట్ చేసుకున్నాను” అంటూ రిలీజ్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో బిజీగా ఉన్న దీపిక, ప్రభాస్ మూవీకి ఓకే చెప్పడం నాగ్ అశ్విన్ కి ఫస్ట్ సక్సస్.

 అనౌన్స్మెంట్ టైంలోనే పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ సినిమా చేస్తున్న అని చెప్పిన నాగ్ అశ్విన్, అందుకు తగ్గట్టుగానే దీపికని సెలెక్ట్ చేసుకున్నాడు. బాహుబలి, సాహోలతో ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన ప్రభాస్ ఒకవైపు, లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాన్ ఇండియా ఇమేజ్… విన్ డీజల్ సినిమాతో వరల్డ్ మార్కెట్ లో ఓన్ ఐడెంటిటీని సొంతం చేసుకున్న దీపిక మరోవైపు. భారి కటవుట్ లకి కేరాఫ్ అడ్రెస్ అయిన ఈ ఇద్దరు కలిసి వరల్డ్ బాక్సాఫీస్ ని దున్నేయడానికి రెడీ అవుతున్నారు. ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందో తెలియదు కానీ ఎప్పుడు రిలీజ్ అయినా ప్రభాస్ మరోసారి బాక్సాఫీస్ ని షేక్ చేయడం ఖాయం.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.