Wed. Jul 8th, 2020

Sambashana

Telugu News Portal

రివ్యూ: తెలుగు రాష్ట్రాల్లో ఇస్మార్ట్ తుఫాన్

1 min read

ముఖ్య గమనిక: మేము మా రివ్యూని సినిమా విడుదలైన రెండు రోజుల తర్వాతే ఇస్తాము

టైటిల్ : ఇస్మార్ట్ శంకర్‌
జానర్ : పక్కా మాస్‌ బొమ్మ
నటీనటులు : ఎనర్జిటిక్ హీరో రామ్‌, గ్లామర్ క్వీన్స్ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌
సంగీతం : బీజీఎమ్ బాద్షా మణిశర్మ
దర్శకత్వం : పూరి జగన్నాథ్‌(పేరు చాలు)
నిర్మాత : పూరి జగన్నాథ్, చార్మింగ్ ఛార్మి

చివరి మాట: మా చివరి మాటని కాస్త ముందుగానే చెప్తున్నాం ఇది కూల్ గా మల్టిప్లెక్స్ థియేటర్స్ లో కూర్చోని సినిమాలోని ప్రతి ఎమోషన్ ని ఫీల్ అయ్యేలా చేసే మూవీ కాదు. సింగల్ స్క్రీన్ థియేటర్ లో మాస్ ఆడియన్స్ మధ్య విజిల్స్ వేస్తూ చూసే సినిమా. ఈ చిత్రం చూసి ఆ వైబ్రేషన్స్ తగిలిన వ్యక్తికి ఇస్మార్ట్ శంకర్ మత్తు అప్పుడే వదలదు.

కేజీఎఫ్ సినిమాలో హీరో ఎలివేషన్ కోసం… గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది అనే ఒక డైలాగ్ ఉంటుంది. మాట్లాడలేని సింహం శ్వాసే అంత పవర్ఫుల్ గా ఉంటే… మాట్లాడడమే కాకుండా అద్భుతంగా, అందరినీ మెప్పించేలా రాయగల పూరి జగన్నాథ్ నుంచి బయటకి వచ్చే డైలాగుల పదును ఇంకెలా ఉంటుందో ఊహించుకోండి. సారీ ఊహించుకోవాల్సిన అవసరం లేదు సింపుల్ గా చెప్పాలంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాలాగా ఉంటుంది. పూరి పని అయిపొయింది అన్న ప్రతి ఒక్కరికీ ఇస్మార్ట్ శంకర్ రిజల్ట్ రీసౌండ్ లా వినిపిస్తూ ఉంటుంది.

కథ :
అరుణ్ ఒక పోలీస్ ఆఫీసర్, ఒక కేసు ఇన్వెస్టిగేషన్ విషయంలో అతను మరణించడంతో, పోలీసులు సైంటిస్ట్‌ పింకీ సాయంతో అరుణ్ మెమొరీని ఓల్డ్ సిటీ ఉస్తాద్ అయిన ఇస్మార్ట్ శంకర్ కి ఎక్కిస్తారు. అసలు అరుణ్ డీల్ చేస్తున్న కేసు ఏంటి? దానికి శంకర్ కి ఉన్న సంబంధం ఏంటి? అరుణ్ మెమరీ ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత శంకర్ జీవితంలో జరిగే పరిణామాలేంటి అనేదే ఇస్మార్ట్ శంకర్ కథ.

నటీనటులు :
ఇస్మార్ట్ శంకర్ సినిమా అంతా వన్ మాన్ షో, ఇప్పటి వరకూ సాఫ్ట్ కుర్రాడిలా కనిపించిన రామ్, పూర్తిగా పూరి మార్క్ హీరోలా సరికొత్త మేకోవర్‌లో కనిపించాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ వెనక ఎంత కష్టం ఉందో క్లైమాక్స్ లో అర్ధమవుతుంది. ముందెన్నడూ చూడని డిఫరెంట్‌ యాటిట్యూడ్‌, తెలంగాణ యాసతో డైలాగ్‌ డెలివరి… ఈరెండు విషయాల్లో ఇస్మార్ట్ శంకర్ పాత్రకి రామ్ ప్రాణం పోశాడు. రామ్ ని కాకుండా ఇంకొకరిని ఈ పాత్రలో ఊహించడం కూడా కష్టమే. కెరీర్ స్టార్టింగ్ నుంచి ఎనర్జీకి కెరాఫ్ అడ్రస్ గా ఉన్న రామ్, ఇస్మార్ట్ శంకర్ లో కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ఇచ్చాడు. ముఖ్యంగా మాస్‌ యాక్షన్‌ సీన్స్‌లో రామ్ పర్ఫామెన్స్‌ సూపర్బ్. పాలాభిషేకం కాకుండా బీరాభిషేకం చేస్తున్నారు అంటే అది రామ్ డెడికేషన్ కి ఫ్యాన్స్ ఇచ్చిన పెద్ద గిఫ్ట్. ఇక రామ్ గర్ల్ ఫ్రెండ్ గా కనిపించిన నభ, తెలంగాణ యాసలో మాట్లాడుతూనే తన అందంతో యూత్ ని కట్టిపడేసింది. చదివింది సివిల్ ఇంజనీరింగ్ అయినా కూడా నచ్చిన వాడి కోసం అన్ని వదిలి వచ్చేసేలా నభ క్యారెక్టర్ డిజైన్ చేసిన విధానం బాగుంది. మరో హీరోయిన్ గా కనిపించిన నిధిది సైంటిస్ట్‌ పాత్ర కావడంతో డీసెంట్ గా కనిపిస్తూనే పాటల్లో గ్లామర్ షో చేసింది. ఈ ఇద్దరూ తమ గ్లామర్ తో ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీ సెంటర్స్ లో మరిన్ని టికెట్స్ తెగడంలో ఉపయోగ పడతారు. నభ, నిధి పాత్రలకి కథనంలోనూ ఇంపార్టెన్స్‌ ఉన్నా కూడా సినిమా అంతా రామ్ మాత్రమే కనపడ్డాడు. మరో కీ రోల్ ప్లే చేసిన సత్యదేవ్‌, తెర మీద కనిపించింది కొద్ది సేపే అయినా తన యాక్టింగ్ తో మెప్పించాడు. షియాజీ షిండే, ఆశిష్ విద్యార్థి తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

విశ్లేషణ :
మర్డర్ ఇన్వెస్టిగేషన్, మెమరీ ట్రాన్స్ఫర్, సైంటిఫిక్ ఫిక్షన్ ప్లాట్ పాయింట్…. ఈ మూడూ ఉన్న ఇస్మార్ట్ శంకర్ కథ వేరే దర్శకుడి చేతిలో పడిఉంటే తెలుగు సినిమా చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ సినిమా అయ్యేది. అయితే అందరిలా తీస్తే వారికి, పూరీకి తేడా ఏముంటుంది. గత కొన్నేళ్లుగా హీరోయిజం అనే పదానికే కొత్త అర్ధం చెప్తూ వచ్చిన పూరి, ఇస్మార్ట్ శంకర్ ప్లాట్ పాయింట్ కి తన ట్రేడ్ మార్క్ మాస్ మంత్రాన్ని కలిపాడు. పక్క తెలంగాణ రౌడీ కుర్రాడికి మెమరీ ట్రాన్స్ఫర్ చేయించి, అతనితో సిల్వర్ స్క్రీన్ పై పెను విధ్వాంసమే సృష్టించాడు. అదిరిపోయే కథనంకి, సూపర్ డైలాగ్స్ రాసిన పూరి 440 వోట్ల్స్ హై తెంపెర్ సినిమాని తీశాడు. ఫస్ట్ ఫ్రేమ్ నుంచి ప్రీ-క్లైమాక్స్ వరకూ ఒక సినిమాని చూపించిన పూరి, క్లైమాక్స్ లో బి,సి సెంటర్స్ లోని ఆడియన్స్ ని సీట్స్ లో కుర్చోనివ్వలేదు. ఇది పక్కా పూరి మార్క్ సినిమా…

తన రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములాని ఫాలో అవుతూనే కథనంలో కాస్త మార్పులు చేసిన పూరి జగన్నాథ్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాడు. అక్కడక్కడా కాస్త స్లో అయినట్లు అనిపించినా కూడా ఓవరాల్ గా మాస్ తో విజిల్ వేయించే సినిమా చేశాడు. ఇక మణిశర్మ మ్యూజిక్‌ ఈ సినిమాకు ప్రధానబలం. తన మ్యూజిక్‌తో ప్రతీ సీన్‌ను మరింతగా ఎలివేట్ చేశాడు మణి. ముఖ్యంగా క్లైమాక్స్ లో మణి ఇచ్చిన బీజీఎమ్ ఎలెక్ట్రిఫయింగ్ గా ఉంది. ఇస్మార్ట్ శంకర్ విజయంలో పూరికి, హీరోకి ఎంత ఇంపార్టెన్స్ ఉందో మణిశర్మకి కూడా అంతే ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది… ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.

ప్లస్‌ పాయింట్స్‌ :
హీరో పెర్ఫార్మెన్స్, పూరి టేకింగ్ అండ్ రైటింగ్, మణిశర్మ మ్యూజిక్

మైనస్ పాయింట్స్: అక్కడక్కడా కథనంలో స్లో అయినట్లు అనిపించడం, ఏ సెంటర్స్ కి దూరం అయ్యేలా ఉండడం.

ఫైనల్ వెర్డిక్ట్: రెండు రోజుల్లోనే 25కోట్ల గ్రాస్ రాబట్టిన ఇస్మార్ట్ శంకర్, ఫస్ట్ వీకెండ్ లోపే బ్రేక్ ఈవెన్ చేరుతుంది. సరైన కమర్షియల్ సినిమా పడక నీరసించిన ప్రేక్షకులకు ఇది పండగ లాంటి సినిమా. తెలంగాణ యాసతో సంబంధం లేకుండా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని మాస్ ఏరియాల్లో ఇస్మార్ట్ శంకర్ మోత మరికొన్ని రోజులు వినిపిస్తూనే ఉంటుంది.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.