Sat. May 30th, 2020

Sambashana

Telugu News Portal

కర్ణాటక నుంచి మరో కేజీఎఫ్ రేంజ్ మూవీ

1 min read
atade srimannaraya rakshith shetty

కేజీఎఫ్… ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన కన్నడ మాగ్నమ్ ఓపస్. యష్ హీరోగా వచ్చిన ఈ సినిమా కర్ణాటక సినిమా స్థాయిని అమాంతం పెంచింది. ఒక రీజినల్ సినిమా సత్తా చాటుతూ వచ్చిన కేజీఎఫ్, దేశవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపించింది. పాన్ ఇండియా మొత్తాన్ని కర్ణాటక వైపు తిరిగి చూసేలా చేసిన ఘనత కేజీఎఫ్ ది. ఇప్పుడు ఈ వారసత్వాన్ని కంటిన్యు చేస్తూ శాండల్ వుడ్ నుంచి మరో సినిమా రాబోతోంది. హ్యుజ్ మేకింగ్ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా పేరు “అవనే శ్రీమన్నారాయణ”. తెలుగులో అతడే శ్రీమన్నారాయణ పేరుతో రిలీజ్ కానున్న ఈ సినిమా, తమిళ హిందీల్లో కూడా విడుదల కానుంది. అన్ని భాషల్లో ఈ మూవీ ఫస్ట్ లుక్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

యూత్ స్టార్, రక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన రెండు టీజర్స్ గతంలోనే కన్నడ ప్రేక్షకుల ముందుకి వచ్చాయి. రిచ్ విజువల్స్, హీరోని ఎలివేట్ చేసే డైలాగ్స్, స్టన్నింగ్ సినిమాటోగ్రఫీ అన్నీ కలిసి ఈ టీజర్ ని కేజీఎఫ్ గుర్తు చేసేలా చేసాయి. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన కేజీఎఫ్ లో మిస్ అయిన ఫన్ ఎలిమెంట్స్ ని అవనే శ్రీమన్నారాయణలో చూడొచ్చు. కరప్టెడ్ కాప్ గా, శ్రీమన్నారాయణ పాత్రలో కనిపించనున్న రక్షిత్ చాలా ఎనర్జిటిక్ గా ఉన్నాడు. అతని బాడీ లాంగ్వేజ్ లో ఫన్ బాగా జనరేట్ అయ్యింది. సచిన్ అనే కొత్త దర్శకుడు ఇంత భారీ సినిమాని చేస్తుండడం విశేషం.

ఇతర భాషల్లో ఈ మూవీ టీజర్ ని ఇంకా డబ్ చేయలేదు. 1980లో అమరావతిలో జరిగిన కథగా అతడే శ్రీమన్నారాయణ తెరకెక్కుతోంది. దాదాపు 195 రోజులు షూటింగ్ జరుపుకున్న ఈ డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకి రానుంది. అన్నట్లు ఈ రక్షిత్ శెట్టి అనే పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తుంది కదా, ఎందుకు అనిపించదు… చలో గీత గోవిందం సినిమాలతో సూపర్ హిట్స్ అందుకోని తెలుగులో స్టార్ హీరోయిన్ గా సెట్ అయిపోయిన రష్మికకి ఎంగేజ్మెంట్ అయిపోయి, విడిపోయింది ఈ హీరో నుంచే…

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.