Sat. Apr 4th, 2020

Sambashana

Online News Portal

ఇస్మార్ట్ శంకర్ కే బొమ్మ చూపించేలా ఉన్నాడు #RAPO2.0

1 min read
#REDTheFilm Teaser

రామ్ పోతినేని… లవర్ బాయ్ లా కనిపించే క్లీన్ ఇమేజ్ ఉన్న కుర్రాడు. ఇలాంటి హీరోని తీసుకోని పూరి జగన్నాధ్, ఇస్మార్ట్ శంకర్ తో బాక్సాఫీస్ కే బొమ్మ చూపించాడు. పక్కా మాస్ క్యారెక్టర్ కి సెట్ అయ్యేలా, అదిరిపోయే చేంజ్ ఓవర్ చూపిస్తూ రామ్ చూపించిన వేరియేషన్ దెబ్బకి బీ సీ సెంటర్స్ షేక్ అయ్యాయి. ఇన్ని రోజులు కనిపించిన రామ్ ఇతనేనా అనిపించే రేంజులో షాక్ ఇచ్చిన రామ్, హిట్ స్ట్రీక్ ని కంటిన్యూ చేస్తూ #RED సినిమాతో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

తమిళ రీమేక్ సినిమానే అయినా #REDలో రామ్ మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది. టీజర్ మొత్తంలో రామ్ చూపించిన 2 వేరియేషన్స్, అతని లుక్ చేంజ్ చేసిన విధానం ఇంప్రెస్ చేస్తుంది. రగ్గడ్ లుక్ లో రామ్ పోతినేనిని చూస్తుంటే, ఇస్మార్ట్ శంకర్ ని మరిపించి, దాన్ని మించిన హిట్ ఇచ్చేలా ఉన్నాడు. #RED టీజర్ లో వచ్చిన మ్యూజిక్ అండ్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. మేకింగ్ చాలా రిచ్ గా ఉంది, కాసేపే కనిపించిన నివేద పేతురేజ్ పోలీస్ లుక్ లో కనిపించి మెప్పించింది. సింపుల్ గా చెప్పాలి అంటే ఇస్మార్ట్ శంకర్ సినిమాలో డబుల్ దిమాక్ ఉంది ఇదర్ అనే డైలాగ్ ఉంది, ఆ డైలాగ్ విజువల్ ఉంటే అది #RED టీజర్ లా ఉంటుంది. హీరో, విలన్ ఒక్కడే కాబట్టి రామ్ పోతినేని… అలియాస్ #RAPO 2.0 #RED సినిమాలో వన్ మాన్ షో చేయడం గ్యారెంటీ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.