Sat. May 30th, 2020

Sambashana

Telugu News Portal

మూడేళ్ల తర్వాత మళ్లీ వార్ కి రెడీ అవుతున్న చిరు, బాలయ్య

1 min read
chiru balayya

అది 2017 సంక్రాంతి, ఒక పక్క ప్రజలు పండగ చేసుకుంటుంటే… మరోపక్క సినీ అభిమానులు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అవుతున్న మూవీస్ ని ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పటిలాగే ఆ సంక్రాంతికి కూడా సినిమా రిలీజ్ అయ్యింది కానీ వసూళ్లు మాత్రం ఎప్పటిలా లేవు, బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షమే కురుస్తుంది. ప్రేక్షకులు థియేటర్స్ కి బండ్లు కట్టుకోని వెళ్తున్నారు, ఒక సినిమా కోసం ఇంత చేస్తారా? అనిపించే రేంజులో ఆడియన్స్ థియేటర్స్ కి వెళ్తున్నారు. ఈ ఇంపాక్ట్ కి కారణం అయిన ఆ సినిమా ఖైది నో 150. వెండితెర ఇలవేల్పుగా మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమాని ఏలిన మెగాస్టార్ చిరంజీవి,, దాదాపు దశాబ్దం గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో అప్పటి చిరు ఫ్యాన్స్, ఇప్పటి మెగా అభిమానులు అందరూ థియేటర్స్ ముందు కనిపించారు. దీంతో ఖైది నంబర్ 150 సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది.

చిరు రీ-ఎంట్రీతో తన స్టామినా ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తే, మరో స్టార్ హీరో నటసింహం నందమూరి బాలకృష్ణ గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాతో హిస్టారికల్ మూవీ చేయాలంటే అది తనతోనే సాధ్యమని మరోసారి నిరూపించాడు. శాతకర్ణి మహారాజుగా బాలయ్య నటనకి డైలాగులకి ఫిదా అవ్వని తెలుగు ప్రేక్షకుడు ఉండి ఉండడు. కలెక్షన్స్ విషయం పక్కన పెడితే 2017 సంక్రాంతి ఈ రెండు సినిమాలు చాలా స్పెషల్ గా మార్చాయి. ఇదే కాంపిటీషన్ ని రిపీట్ చేస్తూ 2021 సంక్రాంతి రెడీ అవుతోంది. చిరు కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్నాడు. బాలయ్య బోయపాటితో కలిసి హాట్రిక్ ఇవ్వడానికి సిద్దమయ్యాడు. భారి అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలు సంక్రాంతినే టార్గెట్ చేశాయి కాబట్టి మరోసారో మెగా నందమూరి హీరోల మధ్య పోటి చూడబోతున్నాం. మరి రిజల్ట్ కూడా 2017లా ఇద్దరికీ కలిసి వస్తుందా లేక ఒకరు హిట్, ఇంకొకరు ఫట్ అనేలా ఉంటుందా అనేది చూడాలి.          

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.