Tue. Mar 31st, 2020

Sambashana

Online News Portal

సీజన్ వచ్చే వరకూ సమస్యలు గుర్తు రాలేదా?

1 min read

దసరా సెలవుల సందర్భంగా ఊర్లు వెళ్లాలి అనుకున్న వాళ్లందరికీ తెలంగాణాలో ఆర్టీసీ సమ్మె షాక్ ఇచ్చింది. ప్రైవేట్ ట్రావెల్స్, ఇతర రవాణా మార్గాలు ప్రజలని దోచుకోవాలని తమ వంతు ప్రయత్నం చేస్తున్నాయి. ఈ సమ్మెని ఆపించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అనుకుంటే, కార్మికులని మరింత రెచ్చగొడుతూ సమ్మెలో పాల్గొంటే ఎస్మా చట్టం ప్రయోగిస్తామని మాట్లాడుతోంది. సమస్యల పరిష్కారం కోసం చర్చలకి సిద్ధం అంటూనే ఎస్మా చట్టం ప్రయోగిస్తామని చెప్పడం అందరికీ ఆగ్రహం తెప్పిస్తోంది. సెలవులని దృష్టిలో పెట్టుకోని ప్రభుత్వం ప్రజలు ఇబ్బంది పడకుండా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నా అవి కంటి తుడుపు చర్యలుగానే మిగిలిపోయాయి.

రెండు రాష్ట్రాల ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండడానికి ఆంధ్ర గవర్నమెంట్, అన్ని ప్రాంతాల నుంచి ప్రత్యేకంగా అదనపు బస్సులు నడుపుతున్నారు. ఇది ప్రజల కోసమని ప్రభుత్వాలు అంటుంటే, సమ్మెలో ఉన్న కార్మికులు మాత్రం టీఎస్ ఆర్టీసీ సమ్మెను భగ్నం చేయడానికి ఏపీ ప్రభుత్వం అన్నివిధాలుగా సహకరిస్తోందని యూనియన్లు దుయ్యబడుతున్నాయి. ఒక్క కృష్ణా జిల్లా నుంచే అక్కడి అధికారులు తెలంగాణకు 100 బస్సులను పంపారు. ఈ విషయాన్ని స్వయంగా కృష్ణా జిల్లా ఆర్టీసీ ఆర్‌ఎం నాగేంద్రప్రసాద్ ప్రకటించారు. విజయవాడ సిటీ సర్వీస్‌లతో పాటుమాత్రం . ఇతర డిపోల నుంచి కొన్ని సర్వీస్‌లను తెచ్చి హైదరాబాద్‌కు పంపుతున్నామని చెప్పారు.

దసరా సెలవలు వచ్చే వరకూ ఆర్టీసీ యూనియన్లకు సమస్యలు గుర్తు రాలేదో? లేక అదును చేసుకోని సమ్మె సమ్మె చేద్దాం అనుకున్నారో కానీ టైం చూసి సమస్య సృష్టించారు. పోనీ ప్రభుత్వమైనా వచ్చిన సమస్యని త్వరగా పరిష్కరిస్తారా అంటే ఆ దిశగా కూడా ప్రయత్నాలు జరగట్లేదు. ప్రభుత్వం నడిచినా, ఆర్టీసీ నడిచినా అది ప్రజల కోసమే, ప్రజల వళ్లే అలాంటి ప్రజలే ఇబ్బంది పెడుతుంటే మిగిలిన సంస్థలు డబ్బులు దండుకునే ప్రయత్నం చేయడం బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం, ఆర్టీసీ నాయకులని పిలిచి దసరా సెలవలు అయ్యాక సమస్యలు పరిష్కరించే దిశగా ఏవైనా చర్యలు తీసుకుంటే బాగుంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.