Sat. May 30th, 2020

Sambashana

Telugu News Portal

Review: లేపండ్రా కటౌట్లు, కట్టండిరా పూలమాలలు

1 min read
sarileru neekevvaru teaser

లేపండ్రా కటౌట్లు, తీయండ్రా పూలమాలలు.. బాబు ఎంట్రీ ఇచ్చాడు ఇక అపోజిషన్ కి బ్యాండ్ ఏ… ఏంట్రా ఈ డైలాగులు, ఎవరి కోసం ఇదంతా అనుకుంటున్నారా? ఆలోచించాల్సిన అవసరం లేదండి, గడిచిన 24 గంటలుగా, మరో 48 గంటల వరకూ సోషల్ మీడియాలో వినిపించే ఒకేఒక్క పేరు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఇంటర్నెట్ లో సెన్సేషన్ సృష్టిస్తున్న సరిలేరు నీకెవ్వరూ గురించే ఇదంతా. ఆ మాత్రం ఇంట్రో ఇవ్వకుండా సూపర్ స్టార్ గురించి ఎలా స్టార్ట్ చేస్తాం.

శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి… ఇవన్నీ సూపర్ హిట్స్ అయ్యి మహేశ్ కి మంచి పేరు తెచ్చాయి. బాక్సాఫీస్ దగ్గర కూడా కాసుల వర్షం కూడా కురిపించాయి. అయితే ఈ సినిమాల్లో మహేశ్ బాబా సైలెంట్ గా, స్టేబుల్ గా సెటిల్డ్ గా పెర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటాడు. దీంతో మహేశ్ ని పెప్పీగా, ఫుల్ జోష్ ఉన్న క్యారెక్టర్ లో చూసి చాలా రోజులు అయిపొయింది, రోజులు కాదు ఏళ్లే గడిచిపోయాయి. ఇప్పుడు ఈ లోటు తీర్చడానికి సరిలేరు నీకెవ్వరూ సినిమా రాబోతోంది. మొదటిసారి స్టార్ హీరోతో వర్క్ చేస్తున్న అనీల్ రావిపూడి, మాగ్జిమమ్ ఇచ్చేశాడు. 24 గంటలుగా చిత్ర యూనిట్ సరిలేరు నీకెవ్వరూపై అంచనాలని పెంచుతూనే ఉంది. ఆ అంచనాలనే మించే స్థాయిలో సరిలేరు నీకెవ్వరూ టీజర్ ఉంది.

ఆర్మీ ఆఫీసర్ గా చాలా పవర్ఫుల్ గా కనిపించిన, మహేశ్ కర్నూల్ సెంటర్ లో కత్తి పట్టాడు. మేజర్ అజయ్ గా యూనిఫామ్ లో మీరు ఎవరో తెలియకున్నా మీకోసం పోరాడతాం అనే డైలాగ్ చెప్పిన సూపర్ స్టార్… కర్నూల్ లో మిమ్మల్ని మేము ఎందుకు చంపుకుంటాం అనే డైలాగ్ చెప్పాడు. ఈ డైలాగ్ అయిపోగానే కొండారెడ్డి బురుజు బ్యాక్ డ్రాప్ లో జరిగే ఫైట్ సీన్ లో “భయపడే వాడే బేరానికి వస్తాడు… దెగ్గర బేరాలు లేవమ్మా” అంటూ మహేశ్ చేసిన ఫైట్ గ్లిమ్ప్స్ సూపర్ గా ఉంది. ఈ సీన్ తర్వాత కనిపించిన లేడీ అమితాబ్ విజయశాంతి “గాయం విలువ తెలిసిన వాడే సాయం చేస్తాడు బాబాయ్” అనే డైలాగ్ చెప్పింది.

విజయశాంతి స్క్రీన్ ప్రెజెన్స్ ఆ ఒక్క డైలాగ్ కే హైలైట్ ఎస్సెట్ అయ్యింది. భారతి పాత్రలో విజయశాంతి ఇచ్చిన ఎలివేషన్ తర్వాత సూపర్ స్టార్ మహేశ్ బాబుపై షాట్ సింప్లి సూపర్బ్ అసలు. ఈ షాట్ తో ఘట్టమనేని అభిమానులు ఫుల్ ఖుషి అయి ఉంటారు. ఇక్కడికే టీజర్ ఒక రేంజులో కనెక్ట్ అయ్యింది అనుకుంటే, ఎండ్ షాట్ లో రైల్వే స్టేషన్ లో ప్రకాష్ రాజ్… మహేశ్ బాబు క్యారెక్టరైజేషన్ గురించి చెప్పిన డైలాగ్ విజిల్స్ వేయించే రేంజులో ఉంది. “ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తాడు అనుకుంటే… ఈసారి మొగుడొచ్చాడు” అనే డైలాగ్ పక్కా విజిల్ వర్త్ అసలు. షార్ట్ అండ్ స్వీట్ గా చెప్పాలి అంటే 1:26 నిమిషాల డ్యూరేషన్ తో వచ్చిన సరిలేరు నీకెవ్వరూ టీజర్ చూసిన తర్వాత ప్రతి ఘట్టమనేని అభిమానులు “ఇప్పుడు చెప్పండ్రా అబ్బాయిలు, రికార్డులు విషయంలో వాట్ టు డు… వాట్ నాట్ టు డూ” అనడం గ్యారెంటీ.

టీజర్ లో మహేశ్ పవర్ఫుల్ అండ్ ఊరమాస్ గా ఉన్నాడు. సూపర్ స్టార్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. అనీల్ రావిపూడి, మహేష్ ని అద్భుతంగా చూపించాడు. దేవి ఇచ్చిన మ్యూజిక్, టీజర్ కి ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ సరిలేరు నీకెవ్వరూ టీజర్ కి మెయిన్ ఎస్సెట్ అయ్యాయి. మొత్తానికి పోకిరి, ఒక్కడు, దూకుడు, ఖలేజా సినిమాల తర్వాత ఆ స్థాయిలో మహేశ్ బాబుని చూడడం ఇదే మొదటిసారి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.