Sat. Apr 4th, 2020

Sambashana

Online News Portal

ఆరు గంటలు… 400 కత్తి పోట్లు… ఎవరు చేసిన నేరం?

1 min read
ankit sharma

ఈశాన్య ఢిల్లీలో వారం రోజులుగా జరుగుతున్నా అల్లర్లలో ఓ ఐబీ అధికారిని చంపేశారని, కాలువలో అతని మృతదేహాన్ని పడేశారని వార్తల్లో చూసాం, విన్నాం. దీనిలో తాజాగా బయటపడుతున్న అంశాలు తెలిస్తే… పగవారికి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగేలా, గుండె తరుక్కుపోయేలా, మెదడు కకావికలమైపోయేలా ఉన్నాయి. ఆయన్ని ఆరు గంటల పాటు నిర్బంధించి, 400 సార్లు కత్తితో పొడిచారట. ఆయన శరీరంలో ప్రతి అవయవాన్ని ఛిద్రం చేశారట, పేగులను కూడా బయటకు తీసి, ముక్కలు ముక్కలు చేశారట. అంత్యంత అమానవీయం, ఆకృత్యమైన ఈ ఘటన ఢిల్లీ అల్లర్లలో జరగడం ఇప్పుడు అందరిని కలచివేస్తుంది.

ఢిల్లీలో ఐబీ అధికారిగా విధుల్లో ఉన్న అంకిత్ శర్మ మంగళవారం నుండి కనిపించకుండా పోయారు. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని అల్లర్లు జరుగుతున్నప్రాంతంలోని డ్రెయిన్ లో ఆయన మృతదేహం కనిపించింది. అంకిత్ తండ్రి రవీందర్ శర్మ దీనిపై పోలీసులకు పిర్యాదు చేసారు. తన కుమారుడ్ని ఆమ్ నేత హుస్సేన్ కి చెందిన భవనం లోకి తీసుకెళ్లారని, అక్కడే అల్లరి మూకలు చంపేసి ఉంటారని పిర్యాదు చేసారు. దీంతో పోలీసులు హుస్సేన్ పై కేసు నమోదు చేసారు. ఇది జరిగిన గంట వ్యవధిలోనే హుస్సేన్ ను పార్టీ నుండి ఆప్ సస్పెండ్ చేసింది. ఈ విషయంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కీలక ప్రకటన చేసారు. అల్లర్లలో, అంకిత్ హత్యలో ఎవరున్నా శిక్షించండి. ఒకవేళ ఆప్ నేతలు ఉంటె రెండు రేట్లు అధికంగా శిక్ష వేయండి అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈశాన్య ఢిల్లీలో శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయి. పారామిలిటరీ బలగాలు మోహరించి, వీధి వీధిన పహారా కాస్తున్నారు. దాదాపు 80 వేలమంది పోలీసులు ఇక్కడ విధుల్లో ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.