Thu. Oct 24th, 2019

Sambashana

Online News Portal

బ్యాచులర్ తేజ్… సోలో బ్రతుకే బెస్ట్ అంటున్నాడు

1 min read
solo brathuke so better

సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ చిత్రలహరి సినిమాతో మంచి హిట్ అందుకోని సక్సస్ ట్రాక్ ఎక్కాడు. అదే ట్రాక్ ని కంటిన్యూ చేస్తూ తేజ్, ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు మారుతితో కలిసి ప్ర‌తిరోజూ పండ‌గే మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే తేజ్ మరో సినిమాని మొదలుపెట్టాడు. రీసెంట్ గానే అనౌన్స్ అయిన ఈ సినిమా ఈరోజు పూజ కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ టైటిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. హార్ట్, కుక్క,టెంపుల్,మైక్ తో డిజైన్ చేసిన పోస్టర్ ఆకట్టుకుంటుంది.

శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాతో సుబ్బ అనే వ్యక్తి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. తేజ్ పక్కన ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్ గా నటించనుంది. ఈ క్రేజి కాంబినేషన్ కి సోలో బ్రతుకే సో బెటరు అనే టైటిల్ ఫిక్స్ చేశారు. రామ్ గోపాల్ వర్మ తీసిన మ‌నీ సినిమాలో భ‌ద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు అనే పాటలోని ప‌ల్ల‌వి నుండి ఈ టైటిల్‌ను తీసుకున్నారు. ఇస్మార్ట్ భామ నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. సాయి ధరమ్ తేజ్ ప్ర‌తిరోజూ పండగే సినిమాతో డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.