Wed. Jul 8th, 2020

Sambashana

Telugu News Portal

ఇది పక్క ఇండియన్ అవెంజర్స్ రేంజ్ మూవీ… ట్రైలర్ అదిరింది

1 min read
Sooryavanshi trailer

అవెంజర్స్, Expandables లాంటి సినిమాలు చూస్తే స్టార్ హీరోలందరూ సూపర్ హీరోలుగా కనిపిస్తూ ప్రేక్షకులని అలరిస్తారు. ఈ రేంజ్ మల్టీస్టారర్ ఇండియాలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు, అవెంజర్స్ స్థాయిలో సూపర్ హీరో సినిమా కాదు కానీ సూపర్ కాప్ సినిమా మాత్రం రాబోతుంది. ఫ్లాప్ అనే మాటే సరిగా తెలియని రోహిత్ శెట్టి, అజయ్ దేవగన్ ని హీరోగా పెట్టి సింగం సినిమా చేశాడు. సూర్య నటించిన సింగం సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేసింది. చాలా రోజులుగా యాక్షన్ హీరోగా కనిపించన అజయ్ దేవగన్ సింగం సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ మూవీ బయటకి వచ్చిన కొన్ని రోజుల తర్వాత రోహిత్ శెట్టి, సింగం మ్యాజిక్ ని రిపీట్ చేస్తూ సింగం రిటర్న్స్ తో మళ్లీ హిట్ ఇచ్చాడు.

ఈ రెండు మూవీస్ హిట్ అవడంతో, రోహిత్ శెట్టి టెంపర్ మూవీని రీమేక్ చేస్తూ రణ్వీర్ సింగ్ హీరోగా సింబా మూవీ చేశాడు. కంటెంట్ ఉన్న సినిమా కావడం, రణ్వీర్ చరిష్మా కలవడంతో సింబా కూడా హిట్ అయ్యింది. హిట్ గా మిగలాల్సిన సింబా సూపర్ హిట్ అవడానికి కారణం.. క్లైమాక్స్ లో అజయ్ దేవగన్ ప్రెజెన్స్… ఎండింగ్ లో అజయ్ దేవగన్ సింగంగా కనిపిస్తే థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. బ్యాక్ టు బ్యాక్ కాప్ మూవీస్ తో హిట్ అందుకున్న రోహిత్ శెట్టి, అక్షయ్ కుమార్ హీరోగా సూర్యవంశీ సినిమా చేస్తున్నాడు. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ వచ్చే ఏడాది మార్చి 24న ప్రేక్షకుల ముందుకి రానుంది.

రిలీజ్ డేట్ దెగ్గర పడడంతో చిత్ర యూనిట్ సూర్యవంశీ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ముంబై సీరియల్ బ్లాస్ట్స్ చుట్టూ తిరిగే కథలో, యాంటీ టెర్రరిజం స్క్వాడ్ హెడ్ గా అక్షయ్ కుమార్ కనిపించాడు. రోహిత్ శెట్టి సినిమాలో ఎప్పుడూ ఉండే భారీ యాక్షన్ స్టంట్స్ ట్రైలర్ నిండా ఉన్నాయి. దాదాపు నాలుగున్నర నిమిషాల డ్యూరేషన్ తో కట్ చేసిన సూర్యవంశీ ట్రైలర్ లో, ఫస్ట్ హాఫ్ అంత అక్షయ్ కుమార్ చుట్టూ తిరిగే… మిగిలిన సగం సింబా. సింగం చుట్టూ తిరిగింది. రణ్వీర్ సింగ్, అజయ్ దేవగన్ తమ ట్రేడ్ మార్క్ స్టైల్ లో ట్రైలర్ లో కనిపించగానే… నిజంగానే ఇది కదరా సరైన మల్టీస్టారర్ అంటే అనే ఫీలింగ్ కలుగుతుంది. ముఖ్యంగా ఎండ్ సీన్ లో ముగ్గురు కలిసి రావడం చూస్తుంటే, విస్టల్ వర్త్ మూమెంట్ అనిపించాల్సిందే. సింగం యూనివర్స్ రేంజ్ పెంచిన ట్రైలర్… సూర్యవంశీ సినిమాపై అంచనాలని ఆకాశాన్ని తాకేలా చేసింది. ఇప్పటివరకూ ఈ స్టార్ హీరోలు… సూపర్ కాప్స్ గా విడి విడిగా వచ్చే బాక్సాఫీస్ ని దున్నేశారు. అలాంటిది కలిసి ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో తెలియాలి అంటే మార్చ్ 24 వరకూ ఆగాల్సిందే.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.