Wed. Jul 8th, 2020

Sambashana

Telugu News Portal

ఆ విషయంలో రాజమౌళి తర్వాత రావిపూడినే…

1 min read
anil ravipudi

ఎస్ ఎస్ రాజమౌళి, హిట్ అనే పదానికే కేరాఫ్ అడ్రస్. 11 సినిమాలు చేసి 11 హిట్స్ ఇచ్చిన ఏకైక డైరెక్టర్ గా నిలిచిపోయాడు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్ లో ఫ్లాప్ అనే మాటే తెలియదు కాబట్టే రాజమౌళి అంతా దర్శక ధీరుడు అంటారు. హిట్టునే కెరీర్ మీటర్ గా చూసే ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత, ఫ్లాప్ అనే మాటే తెలియకుండా కెరీర్ సాగిస్తున్న డైరెక్టర్ ఇంకొకరు ఉన్నారు. ఫన్, ఫ్యామిలీ, కమర్షియల్ అనే తేడా లేకుండా, ఐదేళ్లలో ఫ్లాప్ అనే మాటే తెలియకుండా కెరీర్ సాగిస్తున్న ఆ యంగ్ డైరెక్టర్… అనిల్ రావిపూడి.

పటాస్ సినిమాతో ఇండస్ట్రీకి డైరెక్టర్ గా పరిచయం అయిన అనిల్ రావిపూడి, మొదటి సినిమాకే కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు. ఆడపిల్ల రేప్ అనే సీరియస్ పాయింట్ ని తీసుకోని, కంప్లీట్ ఎంటర్తైనింగ్ గా తెరకెక్కించిన విధానం ప్రతి ప్రేక్షకుడికి నచ్చింది. దీంతో అనిల్ రావిపూడి మొదటి అడుగుని చాలా గ్రాండ్ గా వేశాడు. ఇది అవ్వగానే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంపౌండ్ నుంచి పిలుపొచ్చింది, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తో సినిమా చేసే ఛాన్స్ వచ్చింది. ఇప్పటికీ సాయి ధరమ్ తేజ్ బెస్ట్ మూవీ అంటే.. యాక్టింగ్, ఎంటర్టైన్మెంట్, డాన్స్, డైలాగ్స్ ఇలా ప్రతి విషయంలో సుప్రీమ్ సినిమానే గుర్తొస్తుంది.

ద్వితీయ యజ్ఞం కూడా దిగ్విజయంగా కంప్లీట్ చేసిన అనీల్ రావిపూడి, ఈసారి ఏకంగా మాస్ మహారాజ్ తో సినిమా చేశాడు. పక్కా కమర్షియల్ హీరోని, కంప్లీట్ బ్లైండ్ గా చూపిస్తే, ప్రేక్షకులు యాక్సెప్ట్ చేయరు. రాజా ది గ్రేట్ పక్కా ఫ్లాప్ అవుతుంది, అయినా రెండు హిట్స్ ఇచ్చేయగానే ప్రయోగాలు అవసరమా? రవితేజ లాంటి హీరో దొరికితే మాస్ మసాలా సినిమా చెయ్యొచ్చు కదా అనే కామెంట్స్ వినిపించాయి. అనీల్ రావిపూడి, అదే బ్లైండ్ క్యారెక్టర్ ని పెట్టుకోని ఎక్కడా బోర్ కొట్టకుండా కంప్లీట్ మాస్ సినిమా ఇచ్చాడు. గత రెండు సినిమాలని మించే హిట్ ఇచ్చిన అనీల్ రావిపూడి, ఇండస్ట్రీలో హాట్ కేక్ లా మారిపోయాడు.

హిట్ కోసం ఎదురుచూస్తున్న ఇండస్ట్రీలో, అనీల్ రావిపూడి ఏకంగా హ్యాట్రిక్ హిట్స్ ఇచ్చేశాడు. ఇక నెక్స్ట్ ఏంటి? హిట్ ప్రెజర్ పెరిగింది, అనీల్ రావిపూడి ఈ హిట్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తాడా లేదా అనే డౌట్… నిజానికి ఇవన్నీ ప్రేక్షకులు, ఇండస్ట్రీ వర్గాల్లో వినిపించే మాటలే.. అనీల్ రావిపూడికి మాత్రం కాదు.. నాలుగో సినిమాని కూడా మొదటి సినిమాలాగే చూసిన అనీల్ రావిపూడి, ఈసారి ఎఫ్ 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. వింటేజ్ వెంకటేష్ ని పరిచయం చేస్తూ, వరుణ్ తేజ్ లోని కామెడీ యాంగిల్ ని చూపిస్తూ… భారీ సినిమాల పోటీ మధ్య, లాస్ట్ ఇయర్ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ ని రఫ్ఫాడించింది. ఈ మూవీ చూసి నవ్వని సినీ అభిమాని ఉండడు, పండగ సమయంలో కుటుంబం అంత చూసే సినిమాని ఇచ్చిన అనీల్ రావిపూడి… ఇందులో వర్క్ చేసిన ప్రతి ఒక్కరికీ కెరీర్ బెస్ట్ హిట్ ఇచ్చాడు.

నాలుగు సినిమాలు చేస్తే… నాలుగు హిట్స్ ఇచ్చిన అనిల్ రావిపూడికి, ఎంత చేసినా స్టార్ హీరోల నుంచి మాత్రం పిలుపు రాలేదు. ఇక అనీల్ సెకండ్ గ్రేడ్ హీరోలతోనే సినిమాలు చేయాలి అనుకుంటున్న టైములో ఏకంగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న మహేశ్ బాబు కథ రెడీ చేసుకోమని చెప్పేశాడు. స్టార్ డైరెక్టర్స్ లైన్ లో ఉన్నా, వాళ్లని పక్కన పెట్టేసి అనిల్ రావిపూడికి అవకాశం ఇచ్చిన మహేశ్, అతన్ని ఎంతో నమ్మాడు. మహేశ్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తూ… అనీల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరూ టైటిల్ ని అనౌన్స్ చేశాడు. కెరీర్ లో మొదటిసారి సైనికుడిగా మహేశ్ బాబు, చాలా గ్యాప్ తర్వాత విజయశాంతి రీఎంట్రీ, యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న రష్మిక హీరోయిన్… ఇవన్నీ కలిసి సరిలేరు నీకెవ్వరూ సినిమాని మోస్ట్ అవైటెడ్ మూవీగా మార్చాయి. ఆకాశాన్ని తాకే అంచనాల మధ్య ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ మూవీ, 200 కోట్ల వసూళ్లు రాబట్టి నాన్ బాహుబలి రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుంది.

హీరో ఎవరైనా, తన కథకి, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ని నమ్ముకున్న అనిల్ రావిపూడి.. ఈ ఐదేళ్లల్లో అయిదు మంది హీరోలకి కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చాడు. తన ప్రతి సినిమా రికార్డులని నెక్స్ట్ సినిమాతో చెరిపేస్తున్నాడు. కెరీర్ గ్రాఫ్ ఇంత పెరిగింది కాబట్టే, అనీల్ రావిపూడితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు కూడా ఎదురు చూస్తున్నారు. నెక్స్ట్ మూవీ ఏ హీరోతో చేస్తాడో తెలియదు కానీ, హిట్ మాత్రం ఇస్తాడు అనే గట్ ఫీలింగ్ ప్రతి ఒక్కడికీ కలిగించిన అనీల్ రావిపూడి, ఫ్యూచర్ లో మరింత నవ్వించాలని కోరుకుందాం…

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.