Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

శిల్పా చక్రపాణికి కరోనా రావడానికి కారణం అదేనా?

1 min read
Shilpa Chakrapani Reddy

కర్నూలు జిల్లా శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. కరోనా వ్యాధి వ్యాప్తి జరిగినప్పటి నుంచి నియోజకవర్గ కేంద్రమైన శ్రీశైలంలో అధికారులు కరోనా కట్టడి పలు చర్యలు తీసుకొని ఒక్క కేసు కూడా నమోదు కాకుండా గ్రీన్ జోన్ గా చేశారు. అయితే గత కొన్ని రోజుల క్రితం శ్రీశైలం మండలంలో కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా కు కూడా కరోనా నిర్దారణ కావడంతో ఈ విషయం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. కరోనా వ్యాధి విస్తృతంగా విజృంభించి న సమయంలో ఎమ్మెల్యే శిల్పా నియోజకవర్గంలో ప్రజా సమస్యలపై విస్తృతంగా పర్యటన లు, అధికారులతో సమీక్షలు నిర్వహించారు. అలాగే లాక్ డౌన్ సమయంలో నియోజకవర్గ ప్రజలు ఇబ్బందులు పడకుండా తన వంతు సహాయం గా పార్టీలకు అతీతంగా తన సొంత నిధులతో, దాతల సహకారంతో నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

2014 ఎన్నికల ముందు శ్రీశైలం నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీకి దిగారు. అప్పటి ఎన్నికలకు ముందు నుంచి నియోజకవర్గ ప్రజలకు తన సొంత నిధుల ద్వారా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తాగునీటి ఇబ్బందులు లేకుండా ట్యాంకర్ల ద్వారా కాలనీలకు నీటిని సరఫరా చేశారు. ప్రతి పండుగకు నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక కానుకలు ఇచ్చారు. 2014 ఎన్నికల్లో ఓటమి చెందిన నిరాశ చెందకుండా నియోజకవర్గ ప్రజాసమస్యలపై నిత్యం పోరాడారు. అలాగే అధికారంలో ఉన్న ఎమ్మెల్యే చేసిన సంక్షేమ కార్యక్రమాలకు ధీటుగా సొంత నిధుల ద్వారా ప్రజా సమస్యలను తీర్చడంలో, ముందున్నారు. అప్పట్లో ఓడిపోయిన శిల్పా ఎందుకు నియోజకవర్గ ప్రజలకు సొంత అన్న మాదిరి ఎందుకు సమస్యలు తిరుస్తున్నారు అని అందరూ అనుకున్నారు. కానీ ఆ కష్టం వృధా పోకుండా 2019 ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు తమ మద్దతు తెలిపి అఖండ విజయాన్ని గిఫ్ట్ గా ఇచ్చారు.

కరోనా పాజిటివ్ నిర్దారణ అయిందని ఎమ్మెల్యే శిల్పా నే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఎమ్మెల్యే కు కరోనా వచ్చిందని రాష్ట్రంలో ని మీడియా కోడై కూస్తుంది. కానీ శిల్పా కు కరోనా రావడానికి నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను పరిష్కరించడంతో వచ్చిందనే చెప్పాలి.

ఏది ఏమైనా ఈరోజు కరోనా రావొచ్చు..పోవచ్చు..కానీ నిత్యం ఎమ్మెల్యే శిల్ప ప్రజా సమస్యలు తీర్చడంలో ఎటువంటి ఆపద సమయంలో అయినా ప్రజల వైపు ఉంటాడని నియోజకవర్గ ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.