Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

ఇద్దరి కలయిక భారీగానే ఉంది కానీ డీల్ చేసే డైరెక్టర్ ఎవరు?

1 min read
NTR Mahesh Babu

సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో ఇద్దరూ ఇద్దరే. ఈ ఇద్దరూ కలిసి ఒకేసారి వెండితెర పై కనిపిస్తే ఇంకేమన్నా ఉందా! అవును మహేష్ ఎన్టీఆర్ లతో సినిమాను తెరకెక్కించాలని గీత ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ భావిస్తున్నారట. ఈ టాప్ స్టార్స్ కాంబినేషన్ సెట్ చేయడానికి అరవింద్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడని సమాచారం. తారక్ మహేష్ లు కూడా మంచి ఫ్రెండ్స్ కాబట్టి కథ నచ్చితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి పెద్ద ఆలోచించక పోవచ్చు అనేది అరవింద్ ఆలోచనలా కనిపిస్తుంది. అందుకే టాలీవుడ్ టాప్ రైటర్స్ తో ఈ సినిమా కోసం కథను సిద్ధం చేస్తున్నాడట.

ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ నటిస్తున్నాడు. దీని తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చే సినిమాను కూడా ఆల్రెడీ ఎనౌన్స్ చేసేశాడు. మరో వైపు మహేష్ పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ అయిపోగానే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో, మహేష్ రాజమౌళితో రెడీ అవుతున్నాడు. పాన్ ఇండియా రెంజులో తెరకెక్కుతున్న ఈ సినిమాలు కంప్లీట్ అవ్వాలి అంటే కనీసం మరో రెండు మూడేళ్లు పట్టేలా ఉంది. ఇదంతా బాగానే ఉంది, టాలీవుడ్ బాక్సాఫీస్ ని సోలోగానే దున్నేసే ఈ ఇద్దరు హీరోలని కలిపి ఒకే తెరపై చూపించే ఆ డైరెక్టర్ ఎవరు అనేది మాత్రం అల్లు అరవింద్ కి మాత్రమే తెలియాలి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.