Sat. May 30th, 2020

Sambashana

Telugu News Portal

మెగా స్మగ్లర్ కోసం దేవి మాస్ మసాలా సాంగ్…

1 min read
pusha item song

అల వైకుంఠ‌పురుములో హిట్ తో మంచి జోష్ మీదున్న అల్లు అర్జున్, సుకుమార్ తో చేస్తున్న పుష్పని కూడా అదే రేంజ్ హిట్ ఇవ్వాలనే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాడు. ముఖ్యంగా సాంగ్స్ పై బాగా ద్రుష్టి పెట్టిన  డైరెక్ట‌ర్ అండ్ దేవి, సూపర్ ఆల్బంని రెడీ చేస్తున్నారు. సుకుమార్-దేవీశ్రీ‌- అల్లు అర్జున్ కాంభినేష‌న్ లో వ‌చ్చిన సినిమాల‌న్నీ మ్యూజిక‌ల్ గా హిట్టే. కాబట్టే పుష్పలో సాంగ్స్ చార్ట్ బస్టర్స్ అవుతాయని మెగా అభిమానులు డిసైడ్ అయ్యారు.

అడ‌వులు, గంధం స్మగ్లింగ్ చుట్టూ అల్లిన పక్కా మసాలా కథ కాబట్టి మంచి మాస్ బీట్ సాంగ్ తప్పకుండా ఉంటుంది. రంగస్థలంలో జిగేల్ రాణి లాంటి దుమ్ము లేచిపోయే సాంగ్ ఇచ్చిన ఈ టీ, దాన్ని మించే పాటని పుష్ప కోసం రెడీ చేస్తున్నారు. ఈ పాట కోసం బాలీవుడ్ బ్యూటీ దిశా పటానిని ఫైనల్ చేశారని కూడా సమాచారం. బీ, సి సెంటర్స్ లోని ఆడియన్స్ ని మాస్ సాంగ్ ఇచ్చే ఇంపాక్ట్ మాములుగా ఉండదు, సరైన పాట పడాలే కానీ దాని కోసమే థియేటర్స్ కి వచ్చే ఆడియన్స్ కూడా ఉంటారు. మరి ఐటెం స్పెషలిస్ట్ దేవి, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, సూపర్ డాన్సర్ బన్నీ కలిసి పుష్పలో ఎలాంటి సాంగ్ తో బయటకి వస్తారో చూడాలి. 

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.