Sat. Apr 4th, 2020

Sambashana

Online News Portal

చరిత్రకే ప్యాచ్ వర్క్ చేస్తున్నారా?

1 min read

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ బడ్జట్ సినిమా సైరా, పాన్ ఇండియన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ మూవీలో లేడీ సూపర్ స్టార్ అనుష్క ఒక స్పెషల్ రోల్ ప్లే చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే గత రెండు రోజులుగా అనుష్క సైరాలో ఝాన్సీ లక్ష్మీ భాయ్ పాత్రలో కనిపించనుందని, ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి పాత్రని ఆమె పరిచయం చేస్తుందనే వార్త సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తోంది. వైరల్ అవుతున్న ఈ విషయంలో ఎంత వరకూ నిజముందో తెలియదు కానీ సైరలో అనుష్క ఝాన్సీ రాణి పాత్రలో కనిపించడం అనేది నిజానికి, చరిత్రకి చాలా దూరంగా కనిపిస్తోంది.

తెల్లదొరలకి ఎదురు నిలిచి స్వాతంత్ర పోరాటం మొదలుపెట్టిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని బ్రిటిషర్లు 22-02-1847లో ఉరేసి చంపేశారు. నరసింహారెడ్డి మరణించిన తర్వాత 21-11-1853లో ఝాన్సీ రాజు గంగాధర రావు మరణించారు. ఈయన చనిపోయే వరకూ లక్ష్మీ భాయి బయట ప్రపంచానికి వీరనారిగా తెలియదు. 1857లో మీరట్ లో స్వాతంత్ర పోరాటం మొదలయ్యే వరకూ ఝాన్సీ రాణికి బ్రిటిషర్లపై తిరుగుబాటు చేయాలనే ఆలోచనే చేయలేదు. జూన్ నెల 1857లోనే మొదటిసారి లక్ష్మీ భాయి స్వాతంత్ర పోరాటం మొదలుపెట్టింది. ఆమె పోరాటం మొదలైన ఏడాదికే అంటే సరిగ్గా 18-06-1858కే బ్రిటిషర్లు ఝాన్సీ రాణిని చంపేశారు. సో ఉయ్యాలవాడ కలగమనానికి లక్ష్మీ భాయి తిరుగుబాటు చేసిన సమయానికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. పోనీ గంగాధర రావుతో పెళ్లి కాకముందు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి తెలుసుకునే అవకాశం ఉందా అంటే… నరసింహారెడ్డి మరణించే 19 ఏళ్ల ముందు 19-11-1828న ఝాన్సీ రాణిగా కీర్తించబడుతున్న లక్ష్మీ భాయి పుట్టింది అంటే ఆమెకి ఇరవై ఏళ్లు వచ్చే సరికే ఉయ్యాలవాడ మరణించాడు. భర్త మరణించే వరకూ బయట ప్రపంచానికి పెద్దగా సంబంధాలు లేకుండా బ్రతికిన లక్ష్మీ భాయి, ఆమె పెళ్లికి ముందే ఉయ్యాలవాడ గురించి తెలుసుకునే అవకాశం లేదు. హిస్టరీలో ఎక్కడా ఝాన్సీ రాణి ఉయ్యాలవాడ స్పూర్తితో పోరాటం చేసినట్లు లిఖిత పూర్వక ఆధారాలు లేవు కాబట్టి, చిత్ర యూనిట్ ఈ ఇద్దరినీ ఒకే కథలో పెట్టి చరిత్రకి అతుకులు వేసే పని మంచిది కాదు.

పోనీ 1857లో బ్రిటిషర్లపై తిరుగుబాటు మొదలుపెట్టిన ఝాన్సీ రాణి, అంతకన్నా పదేళ్ల ముందు 1847లో పోరాడి మరణించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని స్ఫూర్తిగా తీసుకోని ఉంటుంది అనే అంచనా వేసి సైరా కథని నడిపిస్తే… ఝాన్సీ రాణిగా అనుష్కతో మొదలైన ఈ సినిమా అంతా ఫ్లాష్ బ్యాక్ మోడ్ లోనే సాగాలి. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథని చెప్తున్నఅనుష్కనే దాన్ని పూర్తి చేయాలి, అంటే కోయిలకుంట్ల కోటికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని ఉరి వేసి చంపేశారు అనే విషయం కూడా చెప్పాలి. అప్పుడే ఝాన్సీ రాణిగా అనుష్క చెప్పడం మొదలుపెట్టిన కథకి కంప్లీట్నెస్ వస్తుంది. ఉయ్యాలవాడ, మరణించడంతోనే సైరా సినిమా అయిపోకూడదు ఎందుకంటే తెల్లదొరలపై పోరాటం చేసిన వీరుడి కథ నుంచి స్ఫూర్తి పొందిన ఝాన్సీ రాణి, క్లైమాక్స్ లో అదే స్పూర్తితో బ్రిటిషర్లపై యుద్దానికి వెళ్లేలా సైరని క్లోజ్ చేయాలి అప్పుడే ఆ సినిమా ఎక్కడ మొదలయ్యిందో అక్కడ వచ్చి ఆగినట్లు అవుతుంది. ఇప్పటి వరకూ సైరా గురించి బయటకి వచ్చిన వార్తల్లో అనుష్క యుద్ధం చేస్తుంది అనే విషయమే లేదు. సో ఆ యుద్ధం లేకుండా, యుద్దానికి సన్నధమయ్యే సన్నివేశాలైనా లేకుండా సైరాని పూర్తి చేస్తే మాత్రం ఆడియన్ చాలా అసంతృప్తిగా ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ముందే అలోచించి ఉంటారు కాబట్టి చిత్ర దర్శక నిర్మాతలు అనుష్కని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పరిచయానికి మాత్రమే వాడినా ఆమెతోనే సినిమాని పూర్తి చేసి ఉండాలి లేదా ఉయ్యాలవాడ రగిలించిన స్వాతంత్ర పోరాట స్ఫూర్తి ఇంకా రగులుతూనే ఉందని, క్లైమాక్స్ లో ఉయ్యాలవాడ మరణం తర్వాత ఒక హై నోట్ లో వాయిస్ ఓవర్ అయినా ఉండాలి. ఈ రెండూ లేకపోతే మాత్రం సైరా వెయ్యి మందిలో ఒక్కడినైనా నిరాశపరిచే అవకాశం ఉంది.

4 thoughts on “చరిత్రకే ప్యాచ్ వర్క్ చేస్తున్నారా?

    1. Thankyou Mandla venkateswarlu Garu… As a father you the best critic for me Nana… All this is just because of your support and love Nana…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.