Mon. Aug 3rd, 2020

Sambashana

Telugu News Portal

బిగ్ బాస్: నోరు జారిన తమన్నా సింహాద్రి

1 min read

బిగ్ బాస్ 3లో వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన తమన్నా సింహాద్రి, మొదటి రోజు నుంచే తన ఆట మొదలు పెట్టింది. వరుణ్ సందేశ్ ని టార్గెట్ చేస్తానని చెప్పిన తమన్నా, ఎపిసోడ్ 11 ఎండింగ్ లో వరుణ్ తో పాటు జైల్లోకి వెళ్ళింది. ఇక గురువారం మొదలైన ఎపిసోడ్ లో, తమన్నా ఆలీకి చుక్కలు చూపించింది. వరుణ్ చేసిన తప్పుని తెలుసుకోని తానే సొంతంగా జైలుకి వెళ్లాడని హిమజ అనడంతో, ఆ మాటలు విన్న వితికా… వరుణ్ క్యారెక్టర్, బిహేవియర్ గురించి మాట్లాడితే బాగోదని చెప్పి కాసేపు హిమజతో వాదించింది. ఆ తర్వాత ఇదే విషయాన్ని వితిక, వరుణ్ కి చేరవేసింది.

ఈ విషయంలో అలీ కూడా హిమజాదే తప్పన్నట్లు, ఆమెని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. అప్పటి వరకు కాస్త అటు ఇటుగా ఉన్న హిమజ ఒక్కసారిగా ఆలీపై కయ్యని లేచింది. కావాలంటే తనని ఎలిమినేట్ చేసుకో కానీ ఇలా మాట్లాడితే బాగోదని కాస్త గట్టిగానే చెప్పింది. ఇక రీసెంట్ గా హిజ్రా సాంగ్ చేసి యూట్యూబ్ లో హల్చల్ చేసిన రాహుల్ సిప్లిగంజ్, జైలులో ఉన్న తమన్నా గతం గురించి అడిగాడు, తను అసలు అమ్మాయిగా ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్పడం మొదలుపెట్టిన తమన్నా, చిన్నప్పటి నుంచే తనకి అమ్మాయిలాగా రెడీ అవడం అంటే ఇష్టమని, చిన్నప్పుడు తనని అందరూ నగ్మాలా ఉన్నావనే వాళ్లని చెప్పుకొచ్చింది. ఇక్కడి వరకూ తన గతం గురించి చాలా ఎమోషనల్ గా చెప్పిన తమన్నా, టాస్క్ లు మొదలు కాగానే విశ్వరూపం చూపించింది. ఈరోజు టాస్క్ లో భాగంగా, గార్డెన్ లో డైమండ్ ఉంటుంది దాన్ని బజర్ మోగగానే ఎవరు ఫస్ట్ వెళ్లి తీసుకుంటారో వాళ్లే హౌస్ కి రాజా అవుతారని చెప్పడంతో… అందరికన్నా ముందు వరుణ్ ఆ వజ్రాన్ని దక్కించుకోని ముందుగా హిమజతో తన బట్టలు ఉతికించుకోని, ఆ బట్టలని శ్రీముఖి అండ్ మహేశ్ విట్టలతో మడత పెట్టించుకున్నాడు.

వరుణ్ తర్వాత వజ్రాన్ని దక్కించుకున్న అలీ, కంటెస్టెంట్స్ తో జంబలకిడి పంబ సినిమాని మళ్లీ చూపించాడు. ఆడవాళ్లు మగవారిగాను, మగవారిని ఆడవాళ్ల గాను మారి తనని ఎంటర్టైన్ చేయమని అలీ చెప్పడంతో… షోలో ఫన్ జనరేట్ అయ్యింది. ఈ సందర్భంగా బాబా భాస్కర్ అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చి హౌస్ తో పాటు ప్రేక్షకులని కూడా ఫుల్ గా నవ్వించాడు. అయితే అప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న తమన్నా.. అలీని సిగ్గగు శరం ఉందా? అసలు నువ్వు తినేది అన్నమేనా అంటూ రెచ్చిపోయింది. రంగు, ఫిజిక్ ఉంటే హీరో కారని.. నువ్వు సినిమాలో హీరో అవుదామనుకున్నా కూడా కాలేవని అరిచిన తమన్నా, కోతికి కొబ్బరి కాయ ఇచ్చినట్లు నీకు రాజు కిరీటం ఇచ్చారు అనింది. బిగ్ బాస్, అలీ చెప్పినంత మాత్రాన ఏది పడితే అది తాను చేయనని చెప్పిన తమన్నా, ఇక షోలో అలీ విలన్ తాను హీరోయిన్… ఆట మొదలైంది అంటూ సవాల్ విసిరింది. అలీని తమన్నా అరుస్తున్నప్పుడు, శివజ్యోతి, రోహిణిలు అడ్డుకునే ప్రయత్నం చేశారు కానీ వారిపై కూడా ఫైర్ అయ్యింది తమన్నా. అయితే ఈ టాస్క్ సమయంలో తాను జంబలకిడి పంబలా ఉన్న ఈ గేమ్ ఆడనని జాఫర్ ముందే తప్పుకున్నాడు. అరుపులు గొడవల మధ్య ఈరోజు ఎపిసోడ్ ముగిసింది. మరి రేపటి ఎపిసోడ్ లో అలీ-తమన్నాల మధ్య ఇంకెంత రచ్చ జరుగుతుందో చూడాలి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.