Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

తెలంగాణాకి 450 కోట్లు రావాలి

1 min read

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శుక్రవారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలపై 50 నిమిషాల పాటు చర్చించారు. 22 అంశాలకు సంబంధించి లేఖలు అందచేశారు. ఈ లేఖల్లో విజ్ఞప్తులు ఇలా ఉన్నాయి.

 • ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు ప్రకారం తెలంగాణలోని వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం ఏటా రూ.450 కోట్లు కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంది. గత ఐదేళ్లలో నాలుగు సార్లు విడుదలయినప్పటికీ, ఒక ఏడాదికి సంబంధించిన నిధులు ఇంకా విడుదల కాలేదు. ఆ నిధులు వెంటనే విడుదల చేయాలి.
 • నేషనల్ హైవేస్ అథారిటీ సహకారంతో ఆదిలాబాద్ జిల్లాలో సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పరిశ్రమను పునరుద్ధరించాలి.
 • తెలంగాణ హైకోర్టులో జడ్డిల సంఖ్యను 24 నుంచి 42కు పెంచాలి.
 • తెలంగాణలో ఐఐఎంను నెలకొల్పాలి.
 • తెలంగాణకు ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్ఇఆర్) మంజూరు చేయాలి.
 • హైదరాబాద్ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్.ఐ.డి.)ని ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ లో నెలకొల్పాలని ప్రతిపాదించిన ఎన్.ఐ.డి.ని రాష్ట్ర పునర్విభజన తర్వాత విశాఖపట్నానికి తరలించారు.
 • అన్ని జిల్లాల్లో నవోదయ విద్యలయాలను ఏర్పాటు చేయాలనే నిర్ణయం మేరకు తెలంగాణలో మరో 23 నవోదయ పాఠశాలలు ఏర్పాటు చేయాలి.
 • రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయాలి. రైల్వే పనులకు అవసరమైన నిధులు విడుదల చేయాలి
 • నీతి ఆయోగ్ సిఫారసులకు అనుగుణంగా మిషన్ కాకతీయ పథకానికి రూ.5,000 కోట్లు, మిషన్ భగీరథకు రూ.19,205 కోట్లు విడుదల చేయాలి.
 • బయ్యారంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి
 • జహీరాబాద్ నిమ్జ్ కు నిధులు విడుదల చేయాలి.
 • తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసిన మేరకు, రాష్ట్రంలో ఎస్సీల వర్గీకరణ చేపట్టాలి.
 • పిపిపి పద్ధతిలో కరీంనగర్ లో ఐఐఐటి నెలకొల్పాలి
 • తెలంగాణలో రిజర్వేషన్లు పెంచాలి. ముస్లింలలోని వెనుకబడిన కులాలకు 12 శాతం రిజర్వేషన్లతో కలపి మొత్తం బిసిలకు 37 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 10 శాతం, రిజర్వేషన్లు కల్పించాలి
 • పార్లమెంటులో, అసెంబ్లీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. ఈ విషయంలో ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది.
 • హైదరాబాద్ – నాగపూర్, వరంగల్ – హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ ను అభివృద్ధి పరచాలి
 • వెనుక బడిన ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధి కోసం పి.ఎం.జి.ఎస్.వై. ద్వారా 4వేల కోట్ల రూపాయలు కేటాయించాలి
 • వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో చేపట్టే రహదారుల పనులకు 60:40 నిష్పత్తిలో కాకుండా, వందశాతం ఖర్చు కేంద్ర ప్రభుత్వమే భరించాలి
 • సెంట్రల్ యూనివర్సిటీ తరహాలో పూర్తి కేంద్ర ఖర్చుతో వరంగల్లో గిరిజన యూనివర్సిటీ నెలకొల్పాలి
 • వరంగల్ టెక్స్ టైల్ పార్కు కోస వెయ్యి కోట్ల రూపాయలను గ్రాంట్ ఇన్ ఎయిడ్ గా అందించాలి
 • రామప్ప దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించాలి
 • వరద కాలువకు సవరించిన అంచనాల ప్రకారం నిధులు విడుదల చేయాలి.
  ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం మద్యాహ్నం హోం మంత్రి అమిత్ షాను, సాంయంత్రం రక్షణ శాఖ మంత్రి రాజనాథ్ సింగ్ ను కూడా కలిశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించారు.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.