Sat. Apr 4th, 2020

Sambashana

Online News Portal

ఈ స్టార్స్ కి ఎగ్జామ్ టైం… ఫెయిల్ అవుతారా? పాస్ అవుతారా?

1 min read

ఎగ్జామ్ టైం వస్తుంది అంటే స్టూడెంట్స్ కి ఎక్కడ లేని టెన్షన్ వస్తుంది. కంప్లీట్ చేయాల్సిన సిలబస్, రాయాల్సిన ఎగ్జామ్స్ గుర్తొచ్చి విద్యార్థులకి ప్రశాంతత ఉండదు. సంవత్సరం అంతా చదివింది రాయడానికి స్టూడెంట్స్ ఏ అంత కష్టపడితే, ఈ ఎగ్జామ్ టైములో రిలీజ్ అయ్యే మూవీ మేకర్స్ ఇంకెంత టెన్షన్ పడాలి. డ్రై సీజన్ కాబట్టే మార్చ్ ఏప్రిల్ నెలలో సినిమాలు పెద్దగా రిలీజ్ కావు, అయితే అప్పుడప్పుడు కొందరు డేర్ చేసిన తమ సినిమాలని రిలీజ్ చేస్తూ ఉంటారు. అలా ఈ ఎగ్జామ్ టైంలో తమ లక్ ని టెస్ట్ చేసుకోవడానికి ప్రేక్షకుల ముందుకి వస్తున్న సినిమాలు ఏంటో చూద్దాం.

ఈ డ్రై సీజన్ లో, ఎగ్జామ్ టెస్ట్ ని పేస్ చేయడానికి ముందుగా ప్రేక్షకుల ముందుకి వస్తున్న హీరో నాచురల్ స్టార్ నాని. గతేడాది కూడా ఎగ్జామ్ టైంలోనే జెర్సీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చిన నాని సూపర్ హిట్ అందుకున్నాడు. 2019 ఏప్రిల్ 19న రిలీజ్ అయిన జెర్సీ విమర్శకుల ప్రశంశలని దక్కించుకుంది. ఈ హిట్ ఇచ్చిన జోష్ లో మరోసారి ఎగ్జామ్ టైములో ‘వి’ సినిమాతో ఆడియన్స్ ని పలరించడానికి రెడీ అవుతున్నాడు. సుదీర్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో నాని మొదటిసారి విలన్ గా నటిస్తున్నాడు. నానిని హీరోని చేసిన ఇంద్రగంటి మోహన్ కృష్ణ, ఇప్పుడు నానిని విలన్ గా చూపించబోతున్నాడు. షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ అయ్యి మెప్పించింది. మరి ఇప్పటివరకూ హీరోగా హిట్స్ అందుకున్న మార్చ్ 25న విలన్ గా మారి ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మార్చ్ నేలని నాని క్లోజ్ చేయడానికి రెడీ అవుతుంటే, ఏప్రిల్ నేలని నాగ చైతన్య గ్రాండ్ గా స్టార్ట్ చేయాలని చూస్తున్నాడు. 2019లో ఏప్రిల్ 5న థియేటర్స్ లో మజిలీ సినిమాతో కనిపించిన నాగ చైతన్య, కెరీర్ బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు. సమంత చైతన్య ల యాక్టింగ్, బ్యూటిఫుల్ కథ కథనం, వినగానే హమ్ చేసేలా ఉన్న పాటలు అన్ని కలిసి మజిలీ సినిమాని సూపర్ హిట్ చేశాయి. చాలా కాలంగా ఫ్లాప్స్ లో ఉండి, మజిలీతో కంబ్యాక్ హిట్ ఇచ్చిన నాగ చైతన్య ఈసారి సాయి పల్లవితో కలిసి తన లవ్ స్టోరీని చూపించబోతున్నాడు. ఫీల్ గుడ్ లవ్ స్టోరీస్ కి కేరాఫ్ అడ్రెస్ అయిన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకి రానుంది. లవ్ స్టోరీ ప్రమోషనల్ కంటెంట్ నాగ చైతన్యకి మరో హిట్ గ్యారెంటీ అనే నమ్మకం కలిగించింది. అదే నమ్మకం ఎప్రిల్ 2న థియేటర్స్ లో కూడా కనిపిస్తే చై ఖాతాలో మరో హిట్ పడినట్లే.

2019లో ఎగ్జామ్ టైంలోనే ప్రేక్షకుల ముందుకి వచ్చి హిట్స్ అందుకున్న ఈ ఇద్దరు హీరోలు 2020లో కూడా సక్సస్ అందుకోవాలని చూస్తున్నారు. అయితే నానికి నాగ చైతన్య గతేడాదిలాగా సోలో హిట్స్ అందుకోవడం అంత ఈజీ కాదు దానికి కారణం లేడీ సూపర్ స్టార్ అనుష్క, టాలీవుడ్ హంక్ రానా రేస్ లో ఉండడమే. నాని, నాగ చైతన్యలకి టఫ్ ఫైట్ చేస్తూ లేడీ సూపర్ స్టార్ అనుష్క రేస్ లోకి వస్తోంది. చివరగా 2018లో భాగమతి సినిమాతో బాక్సాఫీస్ ని షేక్ చేసిన అనుష్క, రెండేళ్లుగా తెరపై కనిపించలేదు. రెండున్నర ఏళ్లుగా అనుష్క నుంచి వచ్చే మూవీ కోసం సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. వాళ్ల ఎదురుచూపుకి తెరదించుతూ అనుష్క నటిస్తున్న లేటెస్ట్ మూవీ నిశ్శబ్దం ఏప్రిల్ 2న ఆడియన్స్ ముందుకి రాబోతుంది. ఎప్పుడూ అదిరిపోయే డైలాగ్స్ చెప్పే అనుష్క, నిశ్శబ్దంలో మాటలు రాని అమ్మాయిగా కనిపించనుంది. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ చాలా ఇంట్రిగ్యుయింగ్ గా అనిపించి, సినీ అభిమానులని మెప్పించింది. కంప్లీట్ గా ఫారిన్ లోనే షూటింగ్ జరుపుకోవడం, మాధవన్ స్పెషల్ రోల్ ప్లే చేయడం, రెండేళ్ల తర్వాత అనుష్క తెరపై కనిపించడం… ఇవన్నీ నిశ్శబ్దం మూవీని మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిలిం ఆఫ్ 2020 లిస్ట్ లో చేరేలా చేసింది.

బాహుబలి సినిమాతో వరల్డ్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్న రానా, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని చేస్తూ కెరీర్ ని బిల్డ్ చేసుకుంటున్నాడు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇస్తున్న రానా, ఏప్రిల్ 2న అరణ్య సినిమాతో ప్రపంచ సినీ అభిమానుల ముందుకి రాబోతున్నాడు. గ్రాండ్ స్కేల్ లో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ మూవీ టీజర్ ని చూసి షాక్ అవ్వని వాళ్లే ఉండరు. కథని నమ్మి, అడవి మనిషిగా రానా మేకోవర్ అద్భుతంగా ఉంది. పాత్ర నచ్చితే తనని తాను ఎలా అయినా మార్చుకుంటానని అరణ్య టీజర్ తోనే ప్రూవ్ చేసిన రానా, ఏప్రిల్ 2న పాన్ ఇండియాని షేక్ చేస్తాడో లేదో చూడాలి. ఒకేరోజుని నలుగురు పెద్ద స్టార్స్ షేర్ చేసుకుంటుంటే, వాళ్లతో తాను కూడా పోటీ పడతాను అంటూ ఒక డెబ్యూ హీరో కూడా రెడీ అయ్యాడు. డెబ్యూ హీరోకి అంత ధైర్యం ఎక్కడిది? థియేటర్స్ కూడా దొరకవు కదా అనుకుంటున్నారా? ఏం పర్లేదు… తన సినిమా ఏప్రిల్ 2నే రిలీజ్ అవుతుంది అని గట్టి నమ్మకంతో ఉన్న ఆ యంగ్ హీరో వైష్ణవ్ తేజ్. మెగా కాంపౌండ్ అనే పేరే అతని ధైర్యం, మెగా ఫ్యాన్స్ అతని బలం… అందుకే రిలీజ్ రేస్ లో ఎంతమంది ఉన్నా వెనక్కి మాత్రం తగ్గను అంటూ ఉప్పెనలా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ ఉప్పెన ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఈ మూవీ ఎలా అయినా హిట్ చేసి వైష్ణవ్ తేజ్ కి గ్రాండ్ వెల్కమ్ చెప్పాలని మెగా అభిమానులు ఎదురుచూస్తున్నారు.

నాని, నాగ చైతన్య, అనుష్క, రానా, వైష్ణవ్ తేజ్… మంచి ఫ్యాన్ బేస్ ఉన్న అయిదుగురు ఒకే రోజున తమ సినిమాలని రిలీజ్ చేస్తుండడంతో థియేటర్స్ కొరతతో పాటు, ఓపెనింగ్స్ విషయంలో హ్యుజ్ గ్రోప్ కనిపించే అవకాశం ఉంది. అసలే డ్రై సీజన్, ఇలాంటి సమయంలో టఫ్ కాంపిటేషన్ ని పెట్టుకోని అయిదు సినిమాలు ఒకేరోజున రిలీజ్ అవుతాయా లేక ఒకటి రెండు వెనక్కి తగ్గుతాయా అనేది చూడాలి. ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో ఈ వార్ అయిపోగానే, సెకండ్ వీక్ ని క్యాప్చర్ చేయడానికి రామ్ పోతినేని రెడీగా ఉన్నాడు. లవర్ బాయ్ లుక్ లో కనిపించే రామ్ పోతినేని, గతేడాది పోస్ట్ సమ్మర్ లో ఇస్మార్ట్ శంకర్ గా ఆడియన్స్ ముందుకి వచ్చాడు. పూరి టేకింగ్, రామ్ యాక్టింగ్ రెండు కలిసి ఇస్మార్ట్ శంకర్ ని పైసా వసూల్ మూవీగా మార్చాయి. సరైన మాస్ సినిమా పడితే బీసీ సెంటర్స్ లో వసూళ్ల వర్షం కురిపిస్తుందని ఇస్మార్ట్ శంకర్ ప్రూవ్ చేసింది. రామ్ ఇంకో పది సినిమాలు చేసినా ఇస్మార్ట్ శంకర్ ఇచ్చిన ఇంపాక్ట్ మాత్రం సినీ అభిమానులు మర్చిపోలేరు.

2019 ఇయర్ కె బెస్ట్ హిట్ ఇచ్చిన రామ్, అదే జోష్ ని కంటిన్యూ చేస్తూ రెడ్ మూవీ తో ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. తమిళ రీమేక్ సినిమానే అయినా #REDలో రామ్ మార్క్ క్లియర్ గా కనిపిస్తుంది. టీజర్ లో వచ్చిన మ్యూజిక్ అండ్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. మేకింగ్ చాలా రిచ్ గా ఉంది. హీరో, విలన్ ఒక్కడే కాబట్టి రామ్ పోతినేని… అలియాస్ #RAPO 2.0 #RED సినిమాలో వన్ మాన్ షో చేయడం గ్యారెంటీ అని అభిమానులు అనుకుంటున్నారు. మరి రామ్ ఇస్మార్ట్ శంకర్ జోష్ ని అలానే కంటిన్యూ చేస్తాడా లేదా అనేది తెలియాలి అంటే ఏప్రిల్ 9 వరకూ ఆగాల్సిందే.

సెకండ్ లో లాగానే ఏప్రిల్ థర్డ్ వెర్క్ లో సోలో రిలీజ్ కాబోతుంది. మహానటి సినిమాతో తనలో అద్భుతమైన నటి ఉందని ప్రూవ్ చేసుకున్న కీర్తి సురేష్, మరోసారి చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ సినిమా మిస్ ఇండియా. కథ నచ్చితే బరువు పెరగడానికి తగ్గడానికి పెద్దగా ఆలోచించని కీర్తి సురేష్, మిస్ ఇండియా కోసం చాలా వెయిట్ లాస్ అయ్యింది. సైజు జీరోకి వచ్చిన కీర్తి సురేష్, ఈ మూవీతో మరో హిట్ అందుకోవాలని చూస్తుంది. మిస్ ఇండియా టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది కాబట్టి సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ట్రైలర్, వీడియో సాంగ్స్ ని టైంకి రిలీజ్ చేస్తూ ఆ హైప్ ని అలానే మైంటైన్ చేస్తే మిస్ ఇండియా సినిమా మంచి ఓపెనింగ్స్ తెచ్చుకునే అవకాశం ఉంది. అయితే మహానటిలో ఉన్నంత కథ బలం మిస్ ఇండియాలో ఉందా లేదా అనేది తెలియాలి అంటే మాత్రం ఏప్రిల్ 17 వరకూ ఆగాల్సిందే.

ఇప్పటివరకూ చెప్పిన సినిమాలు అన్ని ఎగ్జామ్ టైంకి కాస్త ముందే వచ్చేవే కానీ సరిగా పరీక్షల టైములో ప్రేక్షకుల ముందుకి రానున్న సినిమా శ్రీకారం. శర్వానంద్ హీరోగా నటిస్తూయన్న ఈ సినిమాకి ఎగ్జామ్ హీట్ పర్ఫెక్ట్ గా తగలనుంది. కంప్లీట్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కథని మాత్రమే నమ్మి తెరకెక్కుతున్న ఈ సినిమాపై శర్వాకి చాలా ఆశలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో సరైన హిట్ లేదు కాబట్టి శ్రీకారం మూవీతో అయిన కంబ్యాక్ ఇవ్వాలని శర్వా భావిస్తున్నాడు. మరి ఈ మూవీ అయినా శర్వానంద్ కి కలిసొస్తుందా లేదా అనేది ఏప్రిల్ 24 వరకూ ఆగితే తెలుస్తుంది. చూశారు కదా ఇవి వచ్చే రెండు నెలల్లో ప్రేక్షకుల ముందుకి రానున్న సినిమాలు. ఎగ్జామ్స్ టైములో తమ లక్ ని టెస్ట్ చేసుకోవడానికి వస్తున్న ఈ హీరోల్లో ఎవరు డిస్టింక్షన్ లో పాస్ అవుతారు? ఎవరు వీక్ కథతో సినిమా చేసి ఫెయిల్ అవుతారు అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.