Mon. Aug 3rd, 2020

Sambashana

Telugu News Portal

విజయ్ ఫ్యాన్స్ కి చెక్ పెట్టిన తల అజిత్ ఫ్యాన్స్

1 min read
ajith valimai

దళపతి విజయ్ నటిస్తున్న మాస్టర్ సినిమా పోస్టర్ ని న్యూ ఇయర్ గిఫ్ట్ గా రిలీజ్ చేశారు. ఈ టైటిల్ అనౌన్స్మెంట్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ బయటకి రాగానే సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ ట్రెండ్ చేశారు. కోలీవుడ్ కి సంబంధించిన ట్విట్టర్ రికార్డ్స్ ని మాస్టర్ ఫస్ట్ లుక్ బ్రేక్ చేస్తుంది అనుకుంటే ఈలోపు దళపతి అభిమానులకి, తల అజిత్ ఫ్యాన్స్ ఊహించని షాక్ ఇచ్చారు.

మాస్టర్ ఫస్ట్ లుక్ వైరల్ అయ్యే లోపు, ట్విట్టర్ లోకి దిగిన అజిత్ ఫ్యాన్స్… వాలిమై ట్యాగ్ తో ట్రెండ్ చేయడం మొదలుపెట్టారు. నెమ్మదిగా మొదలైన ఈ ట్రెండ్… ట్విట్టర్ నే షేక్ చేసే రేంజుకి వెళ్లింది. దీంతో విజయ్ ఫ్యాన్స్ చేసిన మాస్టర్ ట్రెండ్ వెనకపడాల్సి వచ్చింది. సోషల్ మీడియా అనగానే తమ సత్తా చాటే అజిత్ ఫ్యాన్స్ మరోసారి దాన్ని ప్రూవ్ చేశారు. జస్ట్ ట్యాగ్ తోనే ట్రెండ్ చేసిన వాళ్లు, వాలిమై ఫస్ట్ లుక్ బయటకి వస్తే ఇంకే రేంజులో హల్చల్ చేస్తారో చూడాలి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.