Sat. May 30th, 2020

Sambashana

Telugu News Portal

26 సెకండ్ల వీడియోలో ఇన్ని విశేషాలా చైతూ

1 min read
world of nc19

చైతన్య బర్త్ డే స్పెషల్ గా, ది వరల్డ్ ఆఫ్ NC19 వీడియోని రిలీజ్ చేశారు. బియర్డ్ లుక్ లో నాగచైతన్య… కసువు ఊడ్చడం, దాచిపెట్టిన డబ్బులు లెక్కపెట్టుకోవడం చేస్తూ చాలా నాచురల్ గా కనిపించాడు. అయితే నాచురల్ లుక్ వెనక పెద్ద సంకల్పం ఉన్నట్లు ఉంది. ఎందుకంటే లివ్ అండ్ ఫిట్ అనే స్టూడియోలో నాగ చైతన్య పని చేస్తున్నాడో లేక చైతన్యనే దాన్ని నడిపిస్తున్నాడో తెలియదు కానీ, చైతన్య లాంగ్ ఫ్రేమ్ లో కనిపించిన రెండు మూడు సార్లు కూడా ఈ లివ్ అండ్ ఫిట్ కనిపిస్తూ ఉంటుంది. ఇంకో షాట్ లో చైతన్య డబ్బులు లెక్కపెట్టుకుంటున్న టైములో కూడా ఫ్రిడ్జ్ పైన ఒక ఎనర్జీ డ్రింక్ కనిపిస్తుంది. సో తప్పకుండా నాగ చైతన్య డాన్స్ లేదా ఫిట్నెస్ స్టూడియోలోనే పని చేస్తున్నాడు.

పని చేస్తున్నాడు ఓకే కానీ దాని వెనకున్న కారణం ఏంటి అనేది తెలియాలి అంటే మాత్రం కొన్ని రోజులు ఆగాల్సిందే. ది వరల్డ్ ఆఫ్ NC19 వీడియో ఎండ్ ఫ్రేమ్ లో నాగ చైతన్య నవ్వుతు కనిపిస్తాడు, చాలా ప్రశాంతంగా ఉన్న ఆ నవ్వు ఎవరినైనా పడేయాల్సిందే. ఈ సమయంలో చైతన్య ముందు నిలబడింది సాయి పల్లవినే కావడం విశేషం. పైన చెప్పిన డీటెయిల్ అబ్సర్వ్ చేసి ఉండక పోతే, వీడియోని మళ్లీ రిపీట్ వేయండి. ఒకవేళ చూసేసి ఉంటే చైతన్య బర్త్ డే స్పెషల్ గా ఈవినింగ్ వెంకీ మామ సర్ప్రైస్ కూడా వస్తుంది కాబట్టి అప్పటివరకూ వెయిట్ చేయండి.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.