Wed. Jul 8th, 2020

Sambashana

Telugu News Portal

నియంతలు, నేతలు కలవడం బాధాకరం

1 min read

-కుక్క తోకని ఆడిస్తుందా? లేక తోక కుక్కని ఆడిస్తుందా?
-ధర్నా చోక్ ఎందుకయ్యా? తిన్నది అరగక ధర్నాలు చేస్తారా?

మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాక కేసీఆర్ తెలంగాణలో జరిగిన ధర్నాల గురించి, ప్రజాపోరాటాల గురించి అన్న మాటలు. కేసీఆర్ మాటలు విన్న తర్వాత ప్రజాసంఘాల నుంచి లెఫ్ట్ పార్టీల వరకూ అందరూ ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు. ఈ సందర్భంలోనే కాదు ప్రభుత్వం తప్పులు చేసిన ప్రతిసారి లెఫ్ట్ పార్టీలు వాటిని ఎండగట్టే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కేసీఆర్ కూడా విమర్శలు ఎక్కువ అయినప్పుడు ధర్నాలు ఎందుకు అనే పదజాలం వాడుతూనే ఉంటాడు. నిజానికి ప్రభుత్వాలకి, ప్రజా పార్టీలకి ఎప్పుడు పడదు, ఈ రెండింటి మధ్య సైద్ధాంతిక యుద్ధం జరుగుతూనే ఉంటుంది. సింపుల్ గా చెప్పాలి అంటే కేసీఆర్ ని నియంతతో పోలుస్తూ విమర్శలు, ధర్నాలు చేశారంటే లెఫ్ట్ పార్టీలు తెరాసకి ఎంత వ్యతిరేకమో అర్ధం చేసుకోవచ్చు.

ఇలాంటి భిన్న ధృవాలు కలవడం తెలంగాణ ప్రజలకి మింగుడు పడని విషయం. త్వరలో సూర్యాపేట జిల్లాలో జరగనున్న హుజూర్ నగర్ బైఎలక్షన్స్ లో భాగంగా తెరాస, సిపిఐ కలిసి పని చేస్తున్నాయి. తెరాసకి సిపిఐ మద్దతునివ్వడంతో తెలంగాణ ప్రజలు, ప్రజాసంఘాల నేతలు ఆశ్చర్యపోతున్నారు. సిపిఐ సిద్ధాంతాలు వదిలేసి రాజకీయం చేయడం బాధాకరం. తెలంగాణలో పార్టీని బ్రతికించుకోవడానికి చేశారో లేక ఏదైనా ప్రలోభాలకు లొంగారో తెలియదు కానీ సిపిఐ చేసింది మాత్రం చరిత్రక తప్పిదం. తెరాస మాత్రం సూర్యాపేట ప్రాంతం పోరాటాల గడ్డ కాబట్టి అక్కడ సిపిఐకి మంచి బలం ఉంది కాబట్టే వాళ్లతో కలిసి పోటీ చేస్తున్నారు. ఈ అలియన్స్ తో తెరాస లాభ పడాలని చూస్తుంది కానీ సిపిఐ నాయకులు ఒప్పుకున్నంత మాత్రాన కింద స్థాయి క్యాడర్ ఒప్పుకునే పరిస్థితి మాత్రం కనిపించట్లేదు. ఈ ఎలక్షన్ లో తెరాస గెలిచినా ఓడినా పెద్ద నష్టం లేదు కానీ అధికార పక్షానికి అండగా నిలిచిన సిపిఐకి మాత్రం ఇది చరమదశ.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.