Sat. Apr 4th, 2020

Sambashana

Online News Portal

పవన్ దెబ్బకి ఆ హీరో ఫ్యాన్స్ కి మండిపోయింది…

1 min read
vakeel saab first look

జనసేనాని పవన్ కళ్యాణ్ రెండేళ్ల గ్యాప్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా మారాడు. వకీల్ సాబ్ గా ప్రేక్షకుల ముందుకి రానున్న పవన్ కళ్యాణ్, తన సత్తా తగ్గలేదని తగ్గేది కాదని ఒక్క ఫస్ట్ లుక్ తోనే ప్రూవ్ చేశాడు. మార్చ్ 2న సాయంత్రం అయిదు గంటలకి రిలీజ్ అయిన వకీల్ సాబ్ ఫస్ట్ లుక్, 24 గంటలు తిరిగే సరికి… 3.5 మిలియన్ ట్వీట్స్ తో ట్విట్టర్ లో సునామి సృష్టించింది. ఎదురుచూస్తున్న అప్డేట్ బయటకి వచ్చే సరికి పవన్ ఫాన్స్ వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ తో మోస్ట్ ట్వీట్టెడ్ సౌత్ ఇండియన్ ఫస్ట్ లుక్ గా కొత్త రికార్డు సృష్టించారు.

నిజానికి ఈ మోస్ట్ ట్వీటేడ్ సౌత్ ఇండియన్ ఫస్ట్ లుక్ 3.3 మిళియన్స్ తో అజిత్ పేరు పైన ఉంది. వాలిమై టైటిల్ అనౌన్స్మెంట్ టైములో అజిత్ ఫ్యాన్స్ ఈ రికార్డు క్రియేట్ చేశారు. ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ ఆ అజిత్ రికార్డుని చెరిపేయడంతో, తల అజిత్ అభిమానులంతా ట్విట్టర్ లో ప్రత్యక్షమయ్యారు. తమ హీరో ట్విట్టర్ రికార్డు ఎగిరిపోవడంతో, అజిత్ ఫ్యాన్స్ బోనీ కపూర్ ని ట్యాగ్ చేస్తూ… సోషల్ మీడియాలో ఒక ఆట ఆడుకుంటున్నారు. ఇంతకీ పవన్ ఫ్యాన్స్ అజిత్ రికార్డ్స్ లేపేస్తే, బోనీ కపూర్ ని ఎందుకు తిడుతున్నారు అనే కదా మీ డౌట్… ఎందుకంటే వకీల్ సాబ్ తో పాటు వాలిమై సినిమా ప్రొడ్యూసర్ కూడా బోనీ కపూర్ కాబట్టి.

పింక్ ని తమిళ్లో నెర్కొండ పార్వైగా రీమేక్ చేసిన బోనీ, అజిత్ తోనే నెక్స్ట్ సినిమాని కూడా అనౌన్స్ చేశాడు. గ్రాండ్ గా స్టార్ట్ కూడా అయ్యింది కానీ నెలలు గడుస్తున్నా ప్రొడక్షన్ హౌజ్ నుంచి ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. ఇలాంటి సమయంలో పవన్ ఫ్యాన్స్, అజిత్ రికార్డ్స్ కి ఎసరు పెట్టడంతో… తల అభిమానులకి మండిపోయి బోనీ కపూర్ కి చుక్కలు చూపిస్తున్నారు. మరి అజిత్ ఫ్యాన్స్ దెబ్బకి వాలిమై మూవీ నుంచి ప్రీలుక్ కానీ ఫస్ట్ లుక్ కానీ బయటకి వస్తుందా? ఆ వచ్చే అప్డేట్ వకీల్ సాబ్ రికార్డులని బ్రేక్ చేస్తుందా అనేది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.