Wed. Oct 23rd, 2019

Sambashana

Online News Portal

తమన్నా గ్లామర్… స్పెషల్ అట్రాక్షన్…

1 min read
https://youtu.be/ETrVZG6jiuw

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్, డైరెక్టర్ సుందర్ సి కాంబినేషన్ లో వస్తున్న సినిమా యాక్షన్. హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో విశాల్ చేసిన స్టంట్స్ అండ్ లుక్, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. టీజర్ లో వచ్చిన బీజీఎమ్, లొకేషన్స్ బాగున్నాయి, బాలీవుడ్ సినిమాని చూస్తున్న ఫీలింగ్ కలిగించడంలో మేకర్స్ సక్సస్ అయ్యారు. ఇక యాక్షన్ టీజర్ చూశాక, విశాల్ అండ్ టెక్నికల్ విషయాల తర్వాత తప్పకుండా మాట్లాడుకోవాల్సింది మాత్రం హీరోయిన్ తమన్నా గురించే. ఎప్పుడో కెరీర్ స్టార్టింగ్ లో స్కిన్ షో చేసి, ఆ తర్వాత పాటల్లో మాత్రమే తన గ్లామర్ చూపిస్తూ వచ్చిన మిల్కీ బ్యూటీ ఈసారి మాత్రం తన అందానికి పని చెప్పింది. మోడరన్ లుక్, బికినీ, యాక్షన్ ఎపిసోడ్స్, ఏదీ వదలకుండా చేసిన తమన్నా… మాస్ ఆడియన్స్ ని థియేటర్స్ కి రాబట్టడంలో యాక్షన్ సినిమాకి బాగా ఉపయోగ పడొచ్చు. మొత్తానికి యాక్షన్ టీజర్… తమిళ ప్రేక్షకులకి సరికొత్త యాక్షన్ థ్రిల్లర్ గానే ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.