Sat. May 30th, 2020

Sambashana

Telugu News Portal

బాహుబలి బల్లాలదేవుడుని భరించడం అనుకున్నంత ఈజీ కాదు…

1 min read
rana prabhas

బాహుబలి సినిమాలో రాజమౌళి ఆన్ స్క్రీన్ చేసిన గ్రాఫిక్స్ మాయ పక్కన పెడితే హీరో విలన్లుగా నటించిన ప్రభాస్ రానా… తమ యాక్టింగ్ తో ఆల్ ఇండియా ఆడియన్స్ ని ఆకట్టుకున్నారు. రెండు టిప్పర్ లారీలు కొట్టుకుంటే ఎలా ఉంటుందో బాహుబలి 2 లాస్ట్ ఫైట్ చూస్తే ఎలా ఉంటుంది. సమవుజ్జిలుగా ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసిన ఈ ఇద్దరు మరోసారి కలిసి నటించబోతున్నారు అనే వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.

పాన్ ఇండియా మార్కెట్ ని షేక్ చేసిన ఈ కాంబినేషన్ ని మిస్టర్ పర్ఫెక్ట్ ఫేమ్ దశరద్ రిపీట్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న జాన్, రీసెంట్ గా ఓకే చేసిన నాగ్ అశ్విన్ సినిమా అయిపోగానే ప్రభాస్ దశరద్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇద్నులో హీరోతో పాటు విలన్ పాత్రకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఉండడంతో, దానికి రానా అయితేనే కరెక్ట్ అని దశరద్ అనుకుంటున్నాడట. దశరద్ అనుకోవడం వరకూ బాగానే ఉంది కానీ ఫ్యామిలీ మూవీస్ చేసే డైరెక్టర్ ప్రభాస్ రానా కాంబినేషన్ కి ఉన్న మాస్ ఇమేజ్ ని ఎంత వరకూ బాలన్స్ చేయగలడు అనేది ఆలోచించాల్సిన విషయమే.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.