Tue. Aug 4th, 2020

Sambashana

Telugu News Portal

ఇంకెన్ని రోజులు లవ్ ఫెయిల్యూర్ గానే ఉంటావ్?

1 min read
wfl teaser

సెన్సిబుల్ డైరెక్టర్ క్రాంతి మాధవ్, రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న మూవీ ‘వరల్డ్ ఫేమస్ లవర్’. రాశి ఖన్నా, ఐశ్వర్య రాజేష్, కేథరిన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో విజయ్ ఒక లవర్ బాయ్ గా, సింగరేణి కార్మికుడుగా, ఫైలెట్ గా, బైక్ రేసర్ గా కనిపించనున్నాడు. వాలెంటైన్స్ డే నాడు రిలీజ్ కానున్న ఈ మూవీ టీజర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రేమంటే ఒక కాంప్రమైజ్ కాదు.. ప్రేమంటే ఒక శాక్రిఫైజ్, ప్రేమలో దైవత్వం ఉంటుంది. అవేవీ నీకు అర్థం కావు” అంటూ రాశి ఖన్నా వాయిస్ తో టీజర్ మొదలయ్యింది. విజయ్ ని లవ్ ఫెయిల్యూర్ గా చూపిస్తూ కట్ చేసిన ఈ టీజర్… బాగానే ఉంది కానీ… టీజర్ చూస్తున్నంత సేపు విజయ్ ని స్టార్ హీరో గా నిలబెట్టిన అర్జున్ రెడ్డి ని గుర్తొస్తుంది.

ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన ఈ మూవీ చూశాక విజయ్ ని ఇలాంటి కథలోనే చూడాలని డైరెక్టర్స్ అనుకుంటున్నారో లేక ప్రొడ్యూసర్స్ అనుకుంటున్నారో తెలియదు కానీ లవ్ ఫెయిల్యూర్ సినిమాలు తప్ప విజయ్ నుంచి మరో కథతో సినిమాలు రావట్లేదు. అర్జున్ రెడ్డితో మొదలైన ఈ ట్రెండ్.. గీత గోవిందంలోనూ కంటిన్యూ అయ్యింది. రెండు సినిమాలకి కథ పరంగా చాలా తేడా ఉన్నా, అల్టిమేట్ గా విజయ్ లవర్ బాయ్ గానే కనిపిస్తాడు. ఇక్కడికే అయిపొయింది అనుకుంటే… లాస్ట్ ఇయర్ డియర్ కామ్రేడ్ అంటూ బయటకి వచ్చాడు. సౌత్ ఇండియన్ బాషాళ్ళనింటిలో రిలీజ్ అయిన ఈ సినిమా విజయ్ కి ఊహించని షాక్ ఇచ్చింది. ఒకసారి లవ్ ఫెయిల్యూర్ అయ్యింది… ఏడ్చాడు, ఇంకోసారి లవ్ ఫెయిల్యూర్ అయ్యింది… అమ్మాయిని బ్రతిమాలుకున్నాడు… మరోసారి బ్రేక్ అప్ అయ్యింది… బైక్ ఏసుకొని దేశమంతా ట్రావెల్ చేశాడు.

కథనం మారుతుంది కానీ కథలో కంప్లీట్ గా ఎలాంటి చేంజ్ లేదు. డియర్ కామ్రేడ్ ఫెయిల్యూర్ దెబ్బకైనా విజయ్ మారి ఈ లవ్ స్టోరీస్ కాకుండా కొన్ని రోజులు ఇంకో జానర్ లో సినిమాలు చేస్తాడు అనుకుంటే… మళ్లీ అదే గడ్డం, అదే ఏడుపు, అదే ఫ్రస్ట్రేషన్, అదే డైలాగ్… ఇంకెన్ని రోజులు అదే లవ్ ఫెయిల్యూర్ గా కనిపిస్తావ్ .. రౌడీ హీరో అనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికీ వచ్చే లోపు, విజయ్ ఈ సినిమాలు చేయడం మానేయడం బెటర్. వరల్డ్ ఫేమస్ లవర్ హిట్ అవ్వొచ్చు ఫ్లాప్ అవ్వొచ్చు కానీ… మిగిలిన హీరోలంతా న్యూ ఏజ్ సినిమాలు చేస్తుంటే, విజయ్ లాంటి మాస్ అండ్ క్లాస్ ఇమేజ్ ఉన్న హీరో ఒకే జానర్ లో సినిమాలు చేయడం అతని కెరీర్ కే మంచిది కాదు.

Social menu is not set. You need to create menu and assign it to Social Menu on Menu Settings.